Purandeswari: పారిశ్రామిక వేత్త వల్లగట్ల రెడ్డప్ప ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. మదనపల్లెకు చెందిన పారిశ్రామికవేత్త రెడ్డప్పకు బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పురంధేశ్వరి. ఈ చేరిక కార్యక్రమంలో కిరణ్ కుమార్ రెడ్డి, సోము వీర్రాజు పాల్గొన్నారు. అవినీతి రహిత, వారసత్వ రహిత పాలనను ప్రధాని మోడీ అందిస్తున్నారని ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి తెలిపారు. ఏపీని అభివృద్ధిలో అగ్రభాగాన నిలబెట్టే దిశగా బీజేపీ ప్రభుత్వం సహకరిస్తుందన్నారు.
Read Also: Mudragada Padmanabham: ముద్రగడ కుమారుడితో రాజకీయ అంశాలపై వైసీపీ నేతల చర్చ!
సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లల్లో ఉండేలా మోడీ పాలన ఉందన్నారు..పేద కుటుంబానికి చెందిన మోడీ ప్రధాని అయ్యారని.. ఎస్టీ మహిళ రాష్ట్రపతి అయ్యారని.. ఇది బీజేపీతోనే సాధ్యమన్నారు. సబ్ కే సాత్.. సబ్ కా వికాస్ అనేది బీజేపీ లక్ష్యమన్నారు. జిల్లాల నేతలతో సమావేశం ఇంకా పూర్తి కాలేదని.. వివరాలు సాయంత్రం తెలియచేస్తామన్నారు.