ఎన్డీయే కూటమికి శాసన సభాపక్ష నేతగా ఎన్నికైన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్.. కూటమి అద్భుత విజయం సాధించడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సాధించిన విజయం అని తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని 2021లో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం, తగ్గాము, నిలబడ్డామన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం పార్టీ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. ఈ కార్యక్రమంలో ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇప్పటికే ఏ కన్వెన్షన్ హాల్ కు బీజేపీ ఎమ్మెల్యేలు, పురంధేశ్వరి బయలుదేరి వెళ్లారు.
కేంద్రంలో మోదీ ప్రభుత్వం మళ్లీ కొలువుదీరింది. ఇప్పుడు లోక్‌సభ స్పీకర్ పదవి ఎవరికోసం అన్నది ఆసక్తికరంగా మారింది. పూర్తి మెజారిటీ లేకపోవడంతో భాగస్వామ్య పక్షాల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటైంది. స్పీకర్ పదవి భాజపాకు దక్కుతుందా, మిత్రులకు ఇస్తారా అనేది చర్చనీయాంశం. ప్రొటెమ్ స్పీకర్‌గా కాంగ్రెస్ సీనియర్ నేత కొడికున్నిల్ సురేశ్ లేదా భాజపా సీనియర్ నేత వీరేంద్ర కుమార్ ఉండే అవకాశాలు ఉన్నాయి. స్పీకర్‌గా పురందేశ్వరి లేదా ఓం బిర్లా పేర్లు ప్రచారంలో ఉన్నాయి. మరిన్ని వివరాలు…
ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై చర్చ జరుగుతోంది. ముఖ్యంగా దేశంలో మహిళా ఎంపీల తగ్గుదల అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ ఎన్నికల్లో మహిళల ఓటింగ్ శాతం పెరిగినా, మహిళా ఎంపీలుగా ఎన్నికైనవారి సంఖ్య తగ్గడం గమనార్హం. ఈ లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 73 మంది మహిళా అభ్యర్థులు ఎన్నిక కాగా, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఈ సంఖ్య 78గా ఉంది.
ఎన్నికల సమయంలో, పల్నాడు జిల్లాలో పోలీసు వ్యవస్థ దారుణంగా ఫెయిల్ అయిందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పల్నాడు జిల్లాలో సిట్ బృందం పర్యటిస్తోందని..ఆ బృందాన్ని కలిసి తాను కలిసి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తొండపి అనే గ్రామంలో ఘర్షణల తో ఊరు ఊరంతా వలస పోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పారు.
పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం ఈపూరి వారి పాలెం వద్ద ఘోర రోడ్డుప్రమాదంలో ఆరుగురు మృతిచెందడం పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమ చేసారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ఆమె తీవ్ర సంతాపం తెలిపింది. ఈ సంఘటనలో గాయపడిన వారందరికీ మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. Also Read: Tadipatri: పోలీసుల వలయంలో తాడిపత్రి పట్టణం.. చిన గంజాం నుండి ఓటు వేసి తిరిగి…
ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో బీజేపీ అగ్రనేతలు ఏపీపై ఫోకస్ పెట్టారు.
ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇటీవల తనపై ప్రతిపక్ష నాయకురాలు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి చేసిన ఆరోపణలపై హోమ్ మినిస్టర్ తానేటి వనిత స్పందించారు.
ఏపీ ఛీఫ్ ఎలక్టోరల్ అధికారికి బీజేపీ లేఖ రాసింది. అమిత్ షా పబ్లిక్ మీటింగ్ స్పీచ్ ను ఫేక్ చేసారంటూ కాంగ్రెస్ పార్టీ ఎక్స్ (X) అకౌంట్ పై కంప్లైంట్ చేసింది. రిజర్వేషన్ లు ఎత్తేస్తారంటూ అమిత్ షా మాట్లాడినట్లు సృష్టించారని కంప్లైంట్లో పేర్కొంది.
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరి వైసీపీ మేనిఫెస్టోపై విమర్శలు గుప్పించారు. తుర్పు గోదావరిలో ఆమె మాట్లాడుతూ.. సీఎం జగన్ ప్రకటించిన మేనిఫెస్టోను ప్రజలు నమ్మరన్నారు.