AP BJP Key leaders Delhi Tour: పురంధేశ్వరి సహా ఢిల్లీకి ఏపీ బీజేపీ ముఖ్య నేతలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP BJP Key leaders Delhi Tour: ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ హీట్ కొనసాగుతోంది.. ఏ పార్టీ నేతలు ఢిల్లీ వెళ్లినా.. పొత్తుల కోసమే అనే చర్చ సాగుతోంది.. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వరుసగా హస్తిన పర్యటనకు వెళ్లారు.. చంద్రబాబు.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసి వస్తే.. ఆ తర్వాత ఢిల్లీ వెళ్లిన సీఎం వైఎస్ జగన్.. ప్రధాని మోడీ, అమిత్‌షా, నిర్మలా సీతారామన్ లాంటి వారిని కలిసి వచ్చారు.. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, ప్రాజెక్టలపై విజ్ఞప్తి చేశారు. అయితే, ఈ రెండు పర్యటనల వెనుక.. రాజకీయాలు ఉన్నాయనే చర్చే సాగుతూ వచ్చింది.. మరోవైపు.. ఈ నెల 17వ తేదీన ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సహా ఏపీ బీజేపీ ముఖ్య నేతలు ఢిల్లీ వెళ్లనున్నారు.
Read Also: Top Headlines @ 9 AM : టాప్ న్యూస్
Also Read
- Kiren Rijiju: ‘‘భారత్ బంగ్లాదేశ్ కాదు’’.. ప్రతిపక్షాలకు కిరెన్ రిజిజు వార్నింగ్..
- Army Major: తోటి అధికారుల భార్యలతో వివాహేతర సంబంధం.. ఆర్మీ మేజర్‌పై చర్యలకు సిద్ధం.!
- Sri Lanka: శ్రీలంకలో తీవ్ర విద్యుత్ అంతరాయం.. నీరు, ఇంటర్నెట్ సేవలకు బ్రేక్!
- Abhijeet Dipke: అభిజిత్ దీప్కేకు ఊరట.. షరతులతో బెయిల్..!
ఢిల్లీలో ఎన్నికల సన్నద్ధతపై రెండు రోజుల పాటు జరిగే బీజేపీ జాతీయ సదస్సులో పాల్గొననున్నారు పురంధేశ్వరి, బీజేపీ ముఖ్య నేతలు.. ఇక, బీజేపీ పెద్దలతో ప్రత్యేకంగా పురంధేశ్వరి సమావేశం కానున్నారు.. పొత్తులు.. సీట్ల సర్దుబాటుపై హైకమాండ్‌తో ఏపీ బీజేపీ చీఫ్ చర్చిస్తారని తెలుస్తోంది.. పోటీకి అవకాశం ఉన్న నియోజకవర్గాల జాబితాను ఢిల్లీ పెద్దలకు అందించనున్నారట చిన్నమ్మ.. ఆశావహుల జాబితాను ఢిల్లీ పెద్దల ముందు ఉంచి.. తమ ఓట్ షేర్‌తో పాటు.. పొత్తులతో కలిసివచ్చే అవకాశాలపై కూడా చర్చిస్తారనే ప్రచారం సాగుతోంది.. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో జనసేన-బీజేపీ మధ్య పొత్తు ఉండగా.. ఆ తర్వాత టీడీపీ-జనసేన మధ్య స్నేహం చిగురించింది.. ఇక, టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి ఎన్నికలకు వెళ్లే విషయాలపై చర్చలు కొనసాగుతున్నాయి. బీజేపీ అగ్రనాయత్వంతో చంద్రబాబు చర్చించి వచ్చారు. ఇక, త్వరలో పురంధేశ్వరి కూడా ఢిల్లీ వెళ్తుండడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
తాజావార్తలు
-
YSRCP Nomination Row: ఏపీ స్థానిక ఎన్నికలపై సజ్జల సంచలన వ్యాఖ్యలు.. కూటమి ప్రభుత్వంపై విమర్శలు
-
Punganur Violence: పుంగనూరు ఘటనలో.. ఎంపీ మిథున్ రెడ్డితో పాటు 50 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు!
-
‘గాడ్ ఆఫ్ వార్’ అఫిషియల్ టైటిల్ కాదు.. NTR – Trivikram Movie పై నాగవంశీ బిగ్ క్లారిటీ!
-
Naga Vamsi: ‘జైలర్ 2 హై రేట్ పెట్టి ఎందుకు కొన్నానంటే’.. అసలు నిజం చెప్పిన నాగవంశీ!
-
Kiren Rijiju: ‘‘భారత్ బంగ్లాదేశ్ కాదు’’.. ప్రతిపక్షాలకు కిరెన్ రిజిజు వార్నింగ్..
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!