ఎన్నికల సమయంలో రాజకీయ వలసలు సర్వ సాధారణమైన విషయమే.. ఇప్పుడు పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో.. ఆమ్ ఆద్మీ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది.. ఢిల్లీలో రెండోసారి పీఠం ఎక్కిన ఆ పార్టీ.. ఈ సారి పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది.. అయితే, ఆప్ మాజీ ఎమ్మెల్యే రూపిందర్ కౌర్ రుబీ.. ఇవాళ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు.. గతంలో బటిండా రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న ఆమె.. ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేశారు. సోషల్ మీడియా వేదికగా పార్టీకి ఆ విషయాన్ని తెలియజేశారు.. పార్టీప్రాథమిక సభ్యత్వానికి చేసిన రాజీనామాను వెంటనే ఆమోదించాల్సిందిగా ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను కోరారు. ఇక, ఇవాళ పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ, పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ సమక్షంలో ఆమె కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.