Amrit Pal Singh : ఎట్టకేలకు చిక్కాడు.. అమృత్ పాల్ సింగ్‌ను అరెస్ట్ చేసిన పంజాబ్ పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amrit Pal Singh : దాదాపు 35 రోజులగా తప్పించుకుని తిరుగుతున్న ఖలిస్తాన్ మద్దతుదారు, మత ప్రబోధకుడు అమృత్‌పాల్ సింగ్ ను ఎట్టకేలకు పంజాబ్ పోలీసులు చిక్కాడు. రెండు రోజుల క్రితమే అమృత్ పాల్ భార్యను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆదివారం తెల్లవారుజామున పంజాబ్‌లోని మోగా జిల్లాలో పోలీసుల ఎదుట అమృత్‌పాల్ లొంగిపోయాడు. అర్థరాత్రి సమయంలో మెగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఆయన పోలీసుల వద్ద సరెండర్ అయ్యాడు.
Read Also: IPL2023 : సొంత తప్పిదాలతో ఓడిన లక్నో.. డెత్ ఓవర్స్ లో గుజరాత్ బౌలింగ్ అదుర్స్
Also Read
అమృత్ పాల్ సింగ్ “వారిస్ పంజాబ్ దే” సంస్థ వ్యవస్థాపకుడిగా ఉన్నాడు. అమృత్ పాల్ పంజాబ్ లో మత విద్వేషాలు రెచ్చగొట్టినట్లు సమాచారం. సోషల్ మీడియా ద్వారా పలు వీడియోలు విడుదల చేస్తూ.. పంజాబ్ పోలీసులకు సవాల్ విసురుతూ వచ్చాడు. బైశాఖీ సందర్భంగా పోలీసుల వద్ద లొంగిపోతానని ఆయన గతంలో చెప్పినప్పటికీ అలాజరగలేదు. మరోవైపు పంజాబ్ పోలీసులు అమృత్ పాల్ కోసం విస్తృతంగా గాలించారు. దీంతో ఎటూ పోలేని పరిస్థితుల్లో రహస్య ప్రాంతాల్లో తలదాచుకున్న అమృత్ పాల్.. ఇక పోలీసుల నుంచి తప్పించుకుని పోయే పరిస్థితి లేకపోవటంతో పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం.
Read Also: Rahul Gandhi : రెండ్రోజుల పర్యటన నిమిత్తం నేడు కర్ణాటకు రాహుల్ గాంధీ
ఇతను పంజాబ్ లో ఖలిస్థానీ కార్యకలాపాలను సాగించాడు. అల్లర్లు సృష్టించినట్లు పంజాబ్ పోలీసులు అమృత్ పాల్ పై కేసులు పెట్టారు. జాతీయ భద్రతా చట్టం కింద అమృతపాల్ సింగ్‌ను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. మార్చి 18 నుంచి అమృత్ పాల్ పరారీలో ఉన్నాడు. ఖలిస్థానీ అనుకూల నాయకుడిని అస్సాంలోని దిబ్రూఘర్ జైలుకు తరలించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. అమృతపాల్ సింగ్ మరో ఇద్దరు సహాయకులు పంజాబ్‌లోని మొహాలీలో ఏప్రిల్ 18న పంజాబ్, ఢిల్లీ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో అరెస్టు చేయబడ్డారు.
#AmritpalSingh arrested in Moga, Punjab.
Further details will be shared by #PunjabPolice
Urge citizens to maintain peace and harmony, Don't share any fake news, always verify and share.
— Punjab Police India (@PunjabPoliceInd) April 23, 2023
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!