Parkash Singh Badal: పంజాబ్ మాజీ సీఎంకు నివాళి.. దేశం అంతటా సంతాప దినాలు ప్రకటించిన కేంద్రం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనారోగ్యంతో కన్నుమూసిన పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్‌కు నివాళులర్పిస్తూ దేశవ్యాప్తంగా సంతాప దినాలు పాటించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 26, 27 తేదీలలో భారతదేశం అంతటా రెండు రోజుల సంతాప దినాలు ప్రకటించింది.
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్(ఎస్‌ఎడి) అధినేత ప్రకాష్ సింగ్ బాదల్ (95) మంగళవారం కన్నుమూశారు. భటిండాలోని బాదల్ గ్రామంలో అంత్యక్రియలను నిర్వహించనున్నారు. ప్రకాష్ సింగ్ బాదల్ 1970-71, 1977-80 మరియు 2007-2017 మధ్య పంజాబ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. బాదల్‌కు భార్య సురీందర్ కౌర్ బాదల్, కుమారుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ మరియు కోడలు హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ ఉన్నారు. బాదల్ మృతిపై ప్రధాని మోడీ సహా వివిధ పార్టీలకు చెందిన నాయకులు సంతాపం తెలిపారు.
Also Read:Rajastan police: 12,854 ప్రదేశాలపై దాడులు… 8,950 మంది నేరస్థుల అరెస్టు
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
మరోవైపు అకాలీదళ్ పితామహుడు ప్రకాష్ సింగ్ బాదల్‌కు నివాళులర్పించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ మధ్యాహ్నం చండీగఢ్ చేరుకుంటారని వర్గాలు తెలిపాయి. భారత రాజకీయాల్లో ఒక గొప్ప వ్యక్తి అని మోడీ అన్నారు. మన దేశానికి గొప్పగా దోహదపడిన గొప్ప రాజనీతిజ్ఞుడు, పంజాబ్ పురోగతి కోసం అవిశ్రాంతంగా పనిచేశారని ప్రధాన మంత్రి కొనియాడారు. ప్రకాష్ సింగ్ బాదల్ మృతి వ్యక్తిగతంగా నాకు తీరని లోటు అని అన్నారు. తాను బాదల్‌తో చాలా నేర్చుకున్నాను అని చెప్పారు. బాదల్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రముఖ రాజకీయవేత్తకు గౌరవ సూచకంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా రెండు రోజుల సంతాప దినాలు ప్రకటించింది.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..