ఉగ్రవాదులు, శత్రు దేశాల నుంచి దేశ ప్రజలను, సంపదను రక్షిస్తున్న సైనికుల కృషి మరువలేనిది. ఇళ్లు వాకిలి వదిలి అయినా వారికి దూరంగా ఉంటూ తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల ప్రాణాలను రక్షిస్తుంటారు జవాన్లు. సైనిక ఆపరేషన్స్ లో సైనికులు దేశం కోసం తమ ప్రాణాలను అర్పిస్తుంటారు. అలాంటి వారిని అమర వీరుడి హోదాతో ప్రభుత్వాలు గుర్తిస్తుంటాయి. అయితే సైనిక ఆపరేషన్ లో సైనికుడు తన తోటి సైనికుడు జరిపిన కాల్పుల్లో మరణిస్తే.. అతనికి కూడా…
Punjab and Haryana HC: భర్తని ‘‘హిజ్దా’’(నపుంసకుడు) అని పిలవడం మానసిక క్రూరత్వమే అని పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు వ్యాఖ్యానించింది. ఓ వ్యక్తికి అనుకూలంగా ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన విడాకులను హైకోర్టు సమర్థించింది. ఈ ఏడాది జూలైలో ఫ్యామిలీ కోర్టు తన భర్తకు అనుకూలంగా విడాకులు మంజూరు చేయడాన్ని వ్యతిరేకిస్తూ.. ఒక మహిళ వేసిన పిటిషన్‌ని జస్టిస్ జస్జిత్ సింగ్ బేడీ, జస్టిన్ సుధీర్ సింగ్‌లతో కూడిన డివిజనల్ బెంచ్ విచారించింది.
High Court: వివాహితులు ‘‘సహజీవనం’’ చేయడంపై పంజాబ్-హర్యానా హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇలా ‘‘లివ్ ఇన్ రిలేషన్ షిప్’’లో ఉండే వివాహితులకు రక్షణ కల్పించడం ‘‘తప్పు చేసేవారిని’’ ప్రోత్సహించడం, ద్వంద్వ వివాహాలను ప్రోత్సహించడం లాంటిదే అని కోర్టు అభిప్రాయపడింది.
Khalistan: జాతీయ భద్రతా చట్టం (NSA) కింద అస్సాంలోని దిబ్రూఘర్ జిల్లాలోని జైలులో ఉన్న రాడికల్ సిక్కు మత బోధకుడు, ఖదూర్ సాహిబ్ పార్లమెంటు సభ్యుడు (MP) అమృతపాల్ సింగ్ పంజాబ్, హర్యానా హైకోర్టును ఆశ్రయించారు.
ఖలిస్తాన్ మద్దతుదారు అమృత్‌పాల్ సింగ్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. నామినేషన్ దాఖలు చేసేందుకు వీలుగా తాత్కాలికంగా విడుదల చేయాలని కోరుతూ ఇవాళ ( మే10) పంజాబ్-హర్యానా హైకోర్టును ఆశ్రయించాడు.
Reservation: హర్యానాలో మనోహర్ లాల్ కట్టర్ ప్రభుత్వానికి భారీ ఎదురుదెబ్బ తాకింది. బీజేపీ సర్కార్ తీసుకువచ్చిన వివాదాస్పద బిల్లును పంజాబ్-హర్యానా హైకోర్టు కొట్టేసింది. ప్రైవేట్ రంగంలో రాష్ట్ర నివాసితులకు 75 శాతం రిజర్వేషన్లను తప్పనిసరి చేసే ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. హర్యానా స్టేట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫ్ లోకల్ కాండిడేట్ యాక్ట్ 2020లో ఆమోదించిన తర్వాత అనేక మార్పులకు గురైంది. ఈ చట్టం ద్వారా నెలవారీ జీతం రూ.30,000 కన్నా తక్కువ ఉన్న ప్రైవేట్ ఉద్యోగాల్లో…
High Court: భార్యకు విడాకులు ఇవ్వకుండా వేరే మహిళతో ఉంటున్న వ్యక్తికి సంబంధించిన కేసులో పంజాబ్-హర్యానా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘కామపూరిత, వ్యభిచార జీవితం’’ గడుపుతూ, భార్యకు విడాకులు ఇవ్వని వేరే మహిళతో ఉంటున్న వ్యక్తి సంబంధాన్ని ‘లివ్ ఇన్ రిలేషన్‌షిప్’’ అని పిలువలేమని కోర్టు అభిప్రాయపడింది. తమ ప్రాణాలకు, స్వేచ్ఛకు రక్షణ కల్పించాలని కోరుతూ హైకోర్టులో ఓ జంట దాఖలు చేసిన పిటిషన్‌ని జస్టిస్ కుల్దీప్ తివారీతో కూడిన సింగిల్ జడ్జి బెంచ్ కొట్టేసింది.