Punjab and Haryana HC: భర్తని ‘‘నపుంసకుడు’’ అని పిలవడం మానసిక క్రూరత్వమే..
- భర్తని ‘నపుంసకుడి’గా పిలవడం మానసిక క్రూరత్వమే..
- విడాకులను సమర్థించిన పంజాబ్ - హర్యానా హైకోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Punjab and Haryana HC: భర్తని ‘‘హిజ్దా’’(నపుంసకుడు) అని పిలవడం మానసిక క్రూరత్వమే అని పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు వ్యాఖ్యానించింది. ఓ వ్యక్తికి అనుకూలంగా ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన విడాకులను హైకోర్టు సమర్థించింది. ఈ ఏడాది జూలైలో ఫ్యామిలీ కోర్టు తన భర్తకు అనుకూలంగా విడాకులు మంజూరు చేయడాన్ని వ్యతిరేకిస్తూ.. ఒక మహిళ వేసిన పిటిషన్‌ని జస్టిస్ జస్జిత్ సింగ్ బేడీ, జస్టిన్ సుధీర్ సింగ్‌లతో కూడిన డివిజనల్ బెంచ్ విచారించింది.
‘‘ఫ్యామిలీ కోర్టు చెప్పినదానిని బట్టి చూస్తే, సుప్రీంకోర్టు తీర్పులను పరిశీలిస్తే, అప్పీలుదారు-భార్య యొక్క చర్యలు, ప్రవర్తన క్రూరత్వానికి సమానం’’ అని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. భర్తను హిజ్దాగా పేర్కొనడం, అతడి తల్లిని నపుంసకుడికి జన్మనిచ్చామని దూషించడం మానసిక క్రూరత్వానికి సంబంధంచిన చర్యగా కోర్టు పేర్కొంది. భార్య మొత్తం చర్యలను, ప్రవర్తనను పరిగణలోకి తీసుకుంటే, ఇరువురు ఆరేళ్లుగా విడివిడిగా నివసిస్తున్నట్లు తెలుస్తోందని, వారి మధ్య వివాహం విచ్ఛిన్నమైందని కోర్టు ఆర్డర్ పేర్కొంది.
Also Read
- Meerut Blue Drum Murder: మీరట్ ‘‘బ్లూ డ్రమ్ మర్డర్’’.. మరణశిక్ష విధిస్తూ ‘‘భగవద్గీత’’ను ప్రస్తావించిన న్యాయమూర్తి.!
- CJP: ‘‘సంతకాలు చేసి ఉల్లంఘించారు’’.. కాక్రోచ్ నేతలను జైలుకు పంపడానికి కారణాలివే.!
- Real Estate Boom: రియల్ ఎస్టేట్‌కు జోష్.. ఇళ్ల ధరల్లో 12 శాతం పెరుగుదల.. కొనుగోలుదారుల చూపు అటువైపే
- CJP: ‘‘దేశాన్ని నాశనం చేస్తున్నారు’’.. అభిజిత్ దీప్కేకు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అవమానం..
Read Also: PM Modi Xi Jinping: ఐదేళ్ల తర్వాత ప్రధాని మోడీ, జిన్ పింగ్ భేటీ..
ఈ జంటకు 2017లో వివాహం జరిగింది. తన భార్య చాలా ఆలస్యంగా నిద్ర లేస్తుందని, తన తల్లిని మొదటి అంతస్తులోని బెడ్‌రూమ్ లోకి భోజనం పంపమని అడిగేదని, తన తల్లి కీళ్ల నొప్పులతో బాధపడుతున్నా.. రోజుకు నాలుగైదు సార్లు పైకి పిలిచేదని భర్త కోర్టు తెలిపాడు. తన భార్య పోర్న్ చూడటం అలవాటు చేసుకుందని, శారీరకంగా ఫిట్‌గా లేనని తనను వెక్కిరించేదని, వేరే వ్యక్తిని వివాహం చేసుకోవాలని అనుకుందని చెప్పాడు.
అయితే, భర్త ఆరోపణల్ని భార్య కొట్టిపారేసింది. తాను పోర్న్ చూస్తున్నానని ఎలాంటి సాక్ష్యం లేదని, తన అత్తమామలు తనకు మత్తు మందు ఇస్తు్న్నారని కూడా ఆరోపించింది. తన క్లయింట్‌పై భర్తే క్రూరత్వానికి పాల్పడినట్లు మహిళ తరుపున వాదిస్తున్న లాయర్ కోర్టుకు తెలిపాడు. అయితే, సదరు వ్యక్తి తల్లి తన కొడుకు నపుంసకుడు అని పిలిచేదని సాక్ష్యం చెప్పింది. భార్య తనకు మత్తు మందు ఇస్తున్నారనే వాదనకు రుజువులు చూపించలేకపోయింది. ఇద్దరు ఆరేళ్లుగా కలిసి లేరని, ఈ వివాహం పనికిరాకుండా పోయిందని, పూర్తిగా చనిపోయిందని, తిరిగి కలిసి ఉండాలని ఆదేశించడం ద్వారా ఎలాంటి ప్రయోజనం లేదని కోర్టు పేర్కొంది.
తాజావార్తలు
-
SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
-
India vs West Indies 4th T20: భారత్ vs వెస్టిండీస్ 4th T20I.. టాస్ గెలిచిన భారత్.. సిరీస్‌పై కన్ను
-
IDBI Bank Stake Sale: IDBI బ్యాంక్‌లో భారీ మార్పు! 60.72% వాటాల విక్రయం.. డీల్ విలువ రూ.52,878 కోట్లు
-
Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
-
Congress Councillors: కాంగ్రెస్‌కు ఏడుగురు కౌన్సిలర్ల రాజీనామా.. !
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..