Khalistan: జాతీయ భద్రతా చట్టం (NSA) కింద అస్సాంలోని దిబ్రూఘర్ జిల్లాలోని జైలులో ఉన్న రాడికల్ సిక్కు మత బోధకుడు, ఖదూర్ సాహిబ్ పార్లమెంటు సభ్యుడు (MP) అమృతపాల్ సింగ్ పంజాబ్, హర్యానా హైకోర్టును ఆశ్రయించారు. నిర్బంధంతో సహా చట్టం కింద అతనిపై మొత్తం విచారణలను రద్దు చేయడానికి ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. తన నిర్బంధం చట్టవిరుద్ధం.. కాబట్టి దానిని పక్కన పెట్టే అవకాశం ఉందని పిటిషనర్ హైకోర్టులో ఆఫిడవిట్ సమర్పించారు. ప్రధాన రాజకీయ సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా గళం విప్పినందుకు శిక్షించడం దారుణం, దేశంలోని ప్రతి పౌరుడి ప్రజాస్వామ్య హక్కు అని అమృత్ పాల్ సింగ్ పేర్కొన్నారు.
Read Also: Heart Attack : కాలేజి బస్సు నడుపుతుండగా డ్రైవర్ కు గుండెపోటు.. చివరకు..
ఇక, పౌరుల హక్కులను క్రూరమైన పద్ధతిలో పూర్తిగా హరించారని ఎంపీ అమృత్ పాల్ సింగ్ పేర్కొన్నారు. ఒక సంవత్సరానికి పైగా నిరోధక నిర్బంధ చట్టాన్ని అమలు చేయడమే కాకుండా.. స్వంత రాష్ట్రం, ఇల్లు, స్నేహితుల నుంచి దూరంగా నిర్బంధించారని పిటిషన్ లో పేర్కొన్నారు. నా కుటుంబానికి దాదాపు 2,600 కిలో మీటర్లలో బంధించారని అమృత్ పాల్ సింగ్ ఆరోపించారు.
Read Also: Mallu Bhatti Vikramarka: ఆర్థిక శాఖ సిబ్బందికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క విందు..
అయితే, గత ఏడాది ఫిబ్రవరి 23 న అజ్నాలా పోలీస్ స్టేషన్‌లోకి బారికేడ్లను బద్దలు కొట్టి, కత్తులు, తుపాకులు చూపుతూ అమృత్ పాల్ సింగ్ వెళ్లి.. తన సహాయకులలో ఒకరిని పోలీస్ కస్టడీ నుండి విడిపించే ప్రయత్నంలో పోలీసు సిబ్బందితో ఘర్షణ పడ్డాడు. ఆ తరువాత చాలా రోజుల పాటు కనిపించకుండా పోయిన అతడ్ని ఓ చిన్న గ్రామంలో అరెస్ట్ చేశారు. కాగా, ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లోని ఖదూర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి అమృత్ పాల్ సింగ్ ఎంపీగా ఎన్నికయ్యారు. ఈ నెల ప్రారంభంలో.. పార్లమెంటు సభ్యునిగా ప్రమాణ స్వీకారం కోసం నాలుగు రోజుల పాటు బెయిల్ మీద బటయకు వచ్చారు.