ఖలిస్తాన్ మద్దతుదారు అమృత్‌పాల్ సింగ్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. నామినేషన్ దాఖలు చేసేందుకు వీలుగా తాత్కాలికంగా విడుదల చేయాలని కోరుతూ ఇవాళ ( మే10) పంజాబ్-హర్యానా హైకోర్టును ఆశ్రయించాడు. ప్రస్తుతం అస్సాంలోని దిబ్రూగఢ్ జైలులో ఉన్న అమృత్‌పాల్ పంజాబ్ రాష్ట్రంలోని ఖాదూర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
Read Also: Congress: నేడు విజయవాడలో ఇండియా కూటమి మహాసభ
అయితే, మే 14వ తేదీ గడువు ముగిసేలోపు ఎన్నికలకు తన నామినేషన్ దాఖలు చేసేందుకు వీలుగా 7 రోజుల పాటు రిలీజ్ చేసే అవకాశం ఇవ్వాలని అమృత్‌పాల్ సింగ్ కోరాడు. అలాగే, ఫొటో దిగడంతో పాటు కొత్త బ్యాంక్ ఖాతాను ఓపెన్ చేసేందుకు కావాల్సిన ఇతర కాగితపు పనిని పూర్తి చేయడానికి అవసరమైన ఏర్పాట్లను చేయడానికి జైలు అధికారులను ఆదేశించాలని ఆయన పిటిషన్ లో తెలిపారు. భారతదేశ పౌరుడిగా ఖాదూర్ సాహిబ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఓటరుగా ఉన్నాను.. కాబట్టి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవసరమైన అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. తండ్రి తార్సేమ్ సింగ్ తన నామినేషన్ దాఖలు చేయడానికి మార్గదర్శకాలను అందించాలని పంజాబ్ ప్రధాన ఎన్నికల అధికారితో పాటు అమృత్‌సర్ జిల్లా మేజిస్ట్రేట్‌కు లేఖలు రాశారనే విషయాన్ని కూడా పిటిషన్‌లో అమృత్‌పాల్ సింగ్ వెల్లడించారు.
Read Also: Kedarnath: శివనామస్మరణతో మార్మోగిన కేదార్ నాథ్ ఆలయ ప్రాంగణం
కాగా, తన నామినేషన్ గురించి పంజాబ్ ఎన్నికల చీఫ్ కి లేఖ రాసినప్పటికీ జిల్లా మేజిస్ట్రేట్ ఉద్దేశపూర్వకంగా లేట్ చేస్తుందని అమృత్‌పాల్ సింగ్ తన పిటిషన్‌లో తెలిపారు. ఇక, ఖలిస్థాన్ సానుభూతి పరుడు అమృత్ పాల్ సింగ్ అనుచరులు ఫిబ్రవరి 24వ తేదీన పోలీస్ స్టేషన్ పై దాడి చేయడంతో పాటు.. యువతను రెచ్చగొట్టారన్న ఆరోపణలపై అమృత్ పాల్‌ను జాతీయ భద్రతా చట్టం కింద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.