Puja khedkar: పూజా ఖేద్కర్‌కు మరోసారి చుక్కెదురు.. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
- పూజా ఖేద్కర్‌కు మరో చుక్కెదురు
- ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన ఢిల్లీ కోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్‌కు మరో చుక్కెదురైంది. ఢిల్లీ కోర్టులో ఆమె వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. బుధవారమే ఆమె అభ్యర్థిత్వాన్ని యూపీఎస్సీ తిరస్కరించిన కొన్ని గంట్లోనే న్యాయస్థానంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దీంతో ఆమె చుట్టూ ఉచ్చు మరింత బిగుస్తోంది. తప్పుడు పత్రాలు సమర్పించి యూపీఎస్సీ ఉద్యోగం సంపాదించినట్లుగా ఆరోపణలు రావడంతో ఆమెపై ఢిల్లీ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. దీంతో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఢిల్లీ కోర్టులో పూజా పిటిషన్ వేసింది. గురువారం విచారించిన ధర్మాసనం.. ఆమె అభ్యర్థనను తిరస్కరించింది. దీంతో ఏదో సమయంలో ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది.
ఇది కూడా చదవండి: Iran warns Israel: హమస్ చీఫ్ హనియే హత్యకు తప్పకుండా ప్రతీకారం ఉంటుంది.. ఇజ్రాయిల్‌కి వార్నింగ్..
Also Read
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
- By Election Results: తమిళనాడు బైపోల్స్‌లో టీవీకే విక్టరీ.. బెంగాల్లో బీజేపీ ముందంజ
- Supreme Court: సీజేపీ ఢిల్లీ ఆందోళనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
- Noida Airport: నోయిడా ఎయిర్‌పోర్టుకు ‘నరేంద్ర మోడీ’ పేరు.. యోగి కేబినెట్ ఆమోదం
పూజా ఖేద్కర్ (34)కు యూపీఎస్సీ బుధవారం భారీ షాకిచ్చింది. ఆమె అభ్యర్థిత్వం రద్దు చేయడంతో పాటు భవిష్యత్‌లో జరిగే అన్ని పరీక్షల నుంచి ఆమెను డిబార్ చేసింది. ఆమెపై వచ్చిన ఆరోపణలపై విచారణ తర్వాత యూపీఎస్పీ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో ఆమె భవిష్యత్ అంధకారమైంది.
ట్రైనీ ఐఏఎస్ అధికారిణిగా పూజా ఖేద్కర్ ఎంపిక రద్దు చేస్తూ బుధవారం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ నిర్ణయం తీసుకుంది. ఆమె పరీక్షకు హాజరైన ప్రతిసారి నకిలీ పత్రాలు సృష్టించి హాజరైనట్లుగా గుర్తించింది. ఆమె పేరుతో పాటు.. తల్లిదండ్రుల పేర్లు కూడా పలుమార్లు మార్చేసినట్లుగా తేల్చింది. ఈ నేపథ్యంలోనే భవిష్యత్‌లో కూడా ఎలాంటి పరీక్షలు రాయకుండా నిషేధం విధించింది. ఆమెపై వచ్చిన ఆరోపణలపై యూపీఎస్సీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. జూలై 30 వరకు సమయం ఇచ్చింది. గడువులోగా వివరణ ఇవ్వాలని నోటీసులు పేర్కొంది. కానీ ఆమె ఎలాంటి వివరణ ఇవ్వలేదు. దీంతో ఆమెపై యూపీఎస్సీ చర్యలు తీసుకుంది.
2023 బ్యాచ్‌కు చెందిన పూజా.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరీక్షలో ఆలిండియా వైడ్‌గా 841 ర్యాంక్ సంపాదించింది. దీంతో ట్రైనీ ఐఏఎస్‌గా.. సొంత ప్రాంతమైన పూణెలోనే పోస్టింగ్ పడింది. ఆనందంగా రెండేళ్ల పాటు ట్రైనింగ్ పూర్తి చేసుకోవల్సిన ఆమె.. హద్దులు దాటింది. ఉన్నతమైన పోస్టుకు ఎంపికైనా.. ఎలాంటి సౌకర్యాలు లేకపోవడం.. ఆమెకు రుచించలేదు. అంతే పూణె కలెక్టరేట్‌లో సకల సౌకర్యాలు కల్పించాలని సిబ్బందికి హుకుం జారీ చేసింది. అంతేకాకుండా సెలవుపై వెళ్లిన అదనపు కలెక్టర్.. కార్యాలయాన్ని ఆక్రమించుకుని.. తన నేమ్ ఫ్లేట్.. తన వస్తువుల్ని తెచ్చుపెట్టుకుంది. ఆడికారు.. దానిపై ఎర్ర లైటు.. కారుపై మహారాష్ట్ర ప్రభుత్వం అని రాసిపెట్టుకుని నానా హడావుడి చేసింది. పూజా చర్యలపై విసుగెత్తిన.. పూణె కలెక్టర్.. రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెను వాషిమ్‌కు బదిలీ చేశారు.
ఈ వ్యవహారం ఇంతటితో ఆగలేదు. ఆమె నకిలీ పత్రాలు సమర్పించి ఉద్యోగం సంపాదించినట్లుగా ఆరోపణలు వచ్చాయి. చదువు దగ్గర నుంచి క్యాష్ట్, రేషన్ కార్డు.. ఇలా అన్ని సర్టిఫికెట్లు నకిలీ సృష్టించి ఉద్యోగాన్ని సంపాదించినట్లుగా ఫిర్యాదులు వెళ్లాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. మరోవైపు ఆమె శిక్షణ కాలాన్ని యూపీఎస్సీ నిలిపివేసింది. అంతేకాకుండా ఈనెల 30లోగా వివరణ ఇవ్వాలని తెలిపింది. కానీ ఆమె నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో బుధవారం పూజాపై కఠిన చర్యలు తీసుకుంది. ఆమె అభ్యర్థిత్వంతో పాటు భవిష్యత్‌లో పరీక్షలు రాయకుండా నిషేధం విధించింది.
ఇది కూడా చదవండి: Paris Olympics 2024: 7 నెలల నిండు గర్భంతో ఒలింపిక్స్ క్రీడల్లో పోటీ.. తప్పుబడుతున్న ఈజిప్టు దేశస్థులు
తాజావార్తలు
-
Tollywood: ‘లక్షలు పోసి మరీ తొక్కేస్తున్నారు..’ టాలీవుడ్లో ఈ పెయిడ్ విషప్రచారం ఎవరి పని?
-
No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
-
By Election Results: తమిళనాడు బైపోల్స్‌లో టీవీకే విక్టరీ.. బెంగాల్లో బీజేపీ ముందంజ
-
Vicky Kaushal – Aditya Dhar : ఆగిపోయిన వందల కోట్ల ప్రాజెక్ట్.. విక్కీ కౌశల్ – ఆదిత్య ధర్ కాంబోకి బ్రేక్!
-
Supreme Court: సీజేపీ ఢిల్లీ ఆందోళనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు