యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) చేస్తున్న ఆరోపణలపై మాజీ ఐఏఎస్ ట్రైనీ పూజా ఖేద్కర్ స్పందించారు. ఢిల్లీ హైకోర్టులో ఖేద్కర్ తన సమాధానాన్ని దాఖలు చేశారు. తన అభ్యర్థిత్వాన్ని అనర్హులుగా ప్రకటించే అధికారం యూపీఎస్సీకి లేదని ఆమె పేర్కొన్నారు. ఒకసారి ప్రొబేషనరీ ఆఫీసర్‌గా ఎంపికైన తర్వాత.. అనర్హులిగా ప్రకటించే అధికారం యూపీఎస్సీకి లేదని పూజా తన సమాధానంలో పేర్కొన్నారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్(DoPT)కు మాత్రమే అఖిల భారత సర్వీసుల చట్టం కింద చర్యలు తీసుకునే వీలు ఉందని ఆమె తన వాదన వినిపించారు.
READ MORE: Polavaram: పోలవరం నిధుల విడుదలకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్..
2012-2022 వరకు తన పేరు లేదా ఇంటిపేరులో ఎలాంటి మార్పు లేదని, తన గురించి ఎలాంటి తప్పుడు సమాచారాన్ని యూపీఎస్సీకి అందించలేదని ఆమె పేర్కొన్నారు. బయోమెట్రిక్ డేటా ద్వారా తన గుర్తింపును ధృవీకరించిందని, తాను సమర్పించిన ఏ పత్రం నకిలీది కాదని పూజా ఖేద్కర్ చెప్పారు. తన ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, పుట్టిన తేదీ, వ్యక్తిగత సమాచారంతో సహా అన్ని ఇతర వివరాలు వివరణాత్మక దరఖాస్తు ఫారమ్ (DAF)లో స్థిరంగా ఉన్నాయని పేర్కొన్నారు.
READ MORE:Viral Video: విమానంలో బాయ్ ఫ్రెండ్ కి ప్రపోజ్ చేసిన యువతి.. వీడియో వైరల్
కాగా.. మాజీ ఐఏఎస్ ట్రైనీ పూజా ఖేద్కర్.. అధికార దుర్వినియోగంతో పాటు యూపీఎస్సీలో తప్పుడు అఫిడవిట్ పత్రాలు సమర్పించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో ఆమెను ముస్సోరిలోని లాల్‌బహదూర్ శాస్త్రి జాతీయ అకాడమీకి తిరిగి రావాలని యూపీఎస్సీ ఆదేశించింది. నకిలీ పత్రాలతో పరీక్షను క్లియర్ చేసినట్లు గుర్తించిన యూపీఎస్సీ దానిపై వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఫోర్జరీ కేసు నమోదు చేయడంతో పాటు అభ్యర్థిత్వాన్ని రద్దు చేయడంతో పూజా హైకోర్టును ఆశ్రయించారు. తనపై వచ్చిన ఆరోపణలపై సమాధానం ఇచ్చే వరకు అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కోర్టును కోరారు. దీనిపై నేడు విచారణ జరిగింది.