Puja khedkar: పూజా ఖేద్కర్‌కు భారీ షాక్.. అభ్యర్థిత్వం రద్దు.. పరీక్షలపై డిబార్
- పూజా ఖేద్కర్‌కు భారీ షాక్
- అభ్యర్థిత్వం రద్దుతో పాటు భవిష్యత్ పరీక్షలపై డిబార్
- షోకాజ్ నోటీసుకు స్పందించకపోవడంతో చర్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ (34)కు యూపీఎస్సీ భారీ షాకిచ్చింది. ఆమె అభ్యర్థిత్వం రద్దు చేయడంతో పాటు భవిష్యత్‌లో జరిగే అన్ని పరీక్షల నుంచి ఆమెను డిబార్ చేసింది. ఆమెపై వచ్చిన ఆరోపణలపై విచారణ తర్వాత యూపీఎస్పీ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో ఆమె భవిష్యత్ అంధకారమైంది. ఐఏఎస్ ఉద్యోగం వచ్చాక వివేకంగా ప్రవర్తించకుండా.. గొంతెమ్మ కోర్కెలు కోరి.. లేనిపోని కష్టాలు కొనితెచ్చుకుని ఉద్యోగాన్ని పోగొట్టుకున్న బ్యూరోక్రట్‌గా ఈమె చరిత్రలో నిలిచిపోతుంది.
ట్రైనీ ఐఏఎస్ అధికారిణిగా పూజా ఖేద్కర్ ఎంపిక రద్దు చేస్తూ బుధవారం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ నిర్ణయం తీసుకుంది. ఆమె పరీక్షకు హాజరైన ప్రతిసారి నకిలీ పత్రాలు సృష్టించి హాజరైనట్లుగా గుర్తించింది. ఆమె పేరుతో పాటు.. తల్లిదండ్రుల పేర్లు కూడా పలుమార్లు మార్చేసినట్లుగా తేల్చింది. ఈ నేపథ్యంలోనే భవిష్యత్‌లో కూడా ఎలాంటి పరీక్షలు రాయకుండా నిషేధం విధించింది.
Also Read
- Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
- Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
- CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
- Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
ఆమెపై వచ్చిన ఆరోపణలపై యూపీఎస్సీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఈ నెల 30 వరకు సమయం ఇచ్చింది. గడువులోగా వివరణ ఇవ్వాలని నోటీసులు పేర్కొంది. కానీ ఆమె ఎలాంటి వివరణ ఇవ్వలేదు. దీంతో ఆమెపై యూపీఎస్సీ చర్యలు తీసుకుంది.
బ్యాగ్రౌండ్ ఇదే..
2023 బ్యాచ్‌కు చెందిన పూజా.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరీక్షలో ఆలిండియా వైడ్‌గా 841 ర్యాంక్ సంపాదించింది. దీంతో ట్రైనీ ఐఏఎస్‌గా.. సొంత ప్రాంతమైన పూణెలోనే పోస్టింగ్ పడింది. ఆనందంగా రెండేళ్ల పాటు ట్రైనింగ్ పూర్తి చేసుకోవల్సిన ఆమె.. హద్దులు దాటింది. ఉన్నతమైన పోస్టుకు ఎంపికైనా.. ఎలాంటి సౌకర్యాలు లేకపోవడం.. ఆమెకు రుచించలేదు. అంతే పూణె కలెక్టరేట్‌లో సకల సౌకర్యాలు కల్పించాలని సిబ్బందికి హుకుం జారీ చేసింది. అంతేకాకుండా సెలవుపై వెళ్లిన అదనపు కలెక్టర్.. కార్యాలయాన్ని ఆక్రమించుకుని.. తన నేమ్ ఫ్లేట్.. తన వస్తువుల్ని తెచ్చుపెట్టుకుంది. ఆడికారు.. దానిపై ఎర్ర లైటు.. కారుపై మహారాష్ట్ర ప్రభుత్వం అని రాసిపెట్టుకుని నానా హడావుడి చేసింది. పూజా చర్యలపై విసుగెత్తిన.. పూణె కలెక్టర్.. రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెను వాషిమ్‌కు బదిలీ చేశారు.
ఈ వ్యవహారం ఇంతటితో ఆగలేదు. ఆమె నకిలీ పత్రాలు సమర్పించి ఉద్యోగం సంపాదించినట్లుగా ఆరోపణలు వచ్చాయి. చదువు దగ్గర నుంచి క్యాష్ట్, రేషన్ కార్డు.. ఇలా అన్ని సర్టిఫికెట్లు నకిలీ సృష్టించి ఉద్యోగాన్ని సంపాదించినట్లుగా ఫిర్యాదులు వెళ్లాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. మరోవైపు ఆమె శిక్షణ కాలాన్ని యూపీఎస్సీ నిలిపివేసింది. అంతేకాకుండా ఈనెల 30లోగా వివరణ ఇవ్వాలని తెలిపింది. కానీ ఆమె నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో బుధవారం పూజాపై కఠిన చర్యలు తీసుకుంది. ఆమె అభ్యర్థిత్వంతో పాటు భవిష్యత్‌లో పరీక్షలు రాయకుండా నిషేధం విధించింది.
తాజావార్తలు
-
Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!