Shamshabad Airport Cab Drivers Protest: తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో క్యాబ్ డ్రైవర్ లు ఆందోళనకు దిగారు. ఎయిర్ పోర్ట్ లో ఇతర రాష్ట్రాల క్యాబ్ లు నడపడం వల్ల తమకు ఇబ్బంది కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు వారు. వేలాది క్యాబ్ లను పార్కింగ్ లో నిలిపివేసి క్యాబ్ డ్రైవర్స్ ఆందోళనకు దిగారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరిమించేది లేదంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎయిర్ పోర్ట్ వద్ద ఉన్న క్యాబ్ డ్రైవర్స్. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్యాబ్ డ్రైవర్ లను సముదాయించే ప్రయత్నం చేశారు. అయినా కానీ తాము తిండి, తిప్పలు మానేసి ఎన్ని రోజులైనా సరే పోరాడుతాం కానీ ఇతర రాష్ట్రాల క్యాబ్ లు నడవనియం అంటూ నినాదాలు పెద్ద ఎత్తున చేశారు.
Ibomma: పేరు మార్చుకున్న ఐబొమ్మ.. కొత్త పేరు ఏంటో తెలుసా..?
దాంతో అక్కడ కొద్దిసేపు ఆందోళన చేస్తున్న క్యాబ్ డ్రైవర్ లకు, పోలీసులకు తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దాంతో ఎయిర్ పోర్ట్ ప్రాంగణంలో భారీగా క్యాబ్ లు నిలిచిపోయాయి. దింతూ విమాన ప్రయాణికులు కొంతవరకు ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
Dhanush: ధనుష్ ‘రాయన్’ సరికొత్త రికార్డులు నమోదు చేసెన్..