Mamata Banerjee: నీతి ఆయోగ్ సమావేశంలో కేంద్రాన్ని నిలదీస్తా..
- నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొననున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి
- నీతి ఆయోగ్ సమావేశంలో కేంద్రాన్ని నిలదీస్తా- సీఎం మమతా బెనర్జీ
- నీతి ఆయోగ్ సమావేశంలో కొంతసమయం ఉంటాను- మమతా
- తనకు మాట్లాడేందుకు అవకాశం వస్తే..
- బడ్జెట్‌లో విపక్షపాలిత రాష్ట్రాలపై చూపిన వివక్షపై మాట్లాడుతా- మమతా బెనర్జీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రేపు ఢిల్లీలో జరగనున్న నీతి ఆయోగ్ సమావేశంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాల్గొననున్నారు. ఇండియా కూటమికి చెందిన ఇతర ముఖ్యమంత్రుల మాదిరిగానే ఆమె కూడా సమావేశానికి హాజరుకాకుండా ఉంటారా అనే సస్పెన్స్ కు తెర తీసింది. ఈ క్రమంలో.. నీతిఆయోగ్ సమావేశానికి హాజరవడం కోసం శుక్రవారం ఆమె కలకత్తా నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ‘నీతిఆయోగ్ మీటింగ్‌కు వెళ్తానని బడ్జెట్‌కు ముందే చెప్పా. మీటింగ్‌లో నా స్పీచ్ కాపీని కూడా ఇప్పటికే పంపించాను. ప్రతిపక్షాల పాలనలో ఉన్న రాష్ట్రాలకు నిధుల కేటాయింపులో కేంద్రం వ్యవహరించిన తీరు చూశాక ఈ విషయమే నీతిఆయోగ్‌లో మాట్లాడాలనుకుంటున్నానని తెలిపారు.
Godavari Floods: కాళేశ్వరం వద్ద మళ్లీ ఉగ్రరూపం దాల్చిన గోదావరి
Also Read
- Tarique Rahman: బ్రిక్స్‌కు దూరం.. యూఎన్ భేటీకి న్యూయార్క్ వెళ్తున్న తారిఖ్ రెహమాన్
- ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
- Saudi-Israel: హౌతీల నుంచి భారీ ముప్పు.. ఇజ్రాయెల్ సాయం కోరిన సౌదీ!
- Irctc Tickets Booking: OpenAI మరో సంచలనం.. ఏఐతో ఆటోమేటిక్‌గా రైలు టికెట్లు బుకింగ్
నీతి ఆయోగ్ సమావేశంలో కేంద్రాన్ని నిలదీస్తానని సీఎం మమతా బెనర్జీ అన్నారు. నీతి ఆయోగ్ సమావేశంలో కొంతసమయం ఉంటానని.. తనకు మాట్లాడేందుకు అవకాశం వస్తే.. బడ్జెట్‌లో విపక్షపాలిత రాష్ట్రాలపై చూపిన వివక్షపై మాట్లాడుతానన్నారు. బెంగాల్, పొరుగు రాష్ట్రాలను విభజించేందుకు జరుగుతోన్న కుట్రపై నిరసన వ్యక్తం చేస్తానని పేర్కొన్నారు. లేదంటే.. సమావేశం నుంచి బయటకు వచ్చేస్తా అని మమతా బెనర్జీ తెలిపారు. అయితే.. మమతాబెనర్జీ నీతిఆయోగ్ సమావేశానికి హాజరవడం ఇదే తొలిసారి. 2014లో ప్లానింగ్ కమిషన్‌ను రద్దు చేసి నీతిఆయోగ్‌ను ఏర్పాటు చేయడంపై దీదీ మొదటి నుంచి నిరసన తెలుపుతున్నారు.
WHO: గాజాకు పోలియో ప్రమాదం.. డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక
మరోవైపు.. బడ్జెట్‌లో విపక్షపాలిత రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపించిందని, ఇది సమాఖ్యస్ఫూర్తికి విరుద్ధమని ఇండియా కూటమిలోని పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో.. నిరసనగా శనివారం జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి వెళ్లమంటూ పలు రాష్ట్రాలు తెలిపాయి. అందులో.. తమిళనాడు, కేరళ, పంజాబ్ పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన కర్ణాటక, హిమాచల్, తెలంగాణ సీఎంలు కూడా ఈ సమావేశానికి హాజరుకాలేమని చెప్పారు.
తాజావార్తలు
-
Tarique Rahman: బ్రిక్స్‌కు దూరం.. యూఎన్ భేటీకి న్యూయార్క్ వెళ్తున్న తారిఖ్ రెహమాన్
-
Erravalli Case : ఎర్రవల్లి పసుపు నీళ్ల వివాదంలో ప్రభుత్వానికి షాక్
-
ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
-
Chandrasekhar Reddy: గేట్లు బద్దలు కొట్టి, సెక్యూరిటీని బెదిరించి.. అల్లు అర్జున్ మామ దౌర్జన్యం..?
-
Saudi-Israel: హౌతీల నుంచి భారీ ముప్పు.. ఇజ్రాయెల్ సాయం కోరిన సౌదీ!
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?