Kolkata doctor case: వైద్యుల నిరసనల్లో పాల్గొన్న క్రికెట్ లెజెండ్ గంగూలీ దంపతులు
- వైద్యుల నిరసనల్లో పాల్గొన్న క్రికెట్ లెజెండ్ గంగూలీ దంపతులు
- బాధితురాలి కుటుంబానికి న్యాయం జరగాలని డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన భారతీయుల హృదయాలను కలిచివేస్తోంది. ఆస్పత్రిలో అత్యంత క్రూరంగా వైద్యురాలు హత్యాచారానికి గురి కావడంతో మానవత్వం ఉన్న ప్రతివారి హృదయాలను చలింపచేస్తోంది. ఇప్పటికే వైద్యులు, నర్సులు, మహిళా సంఘాలు, రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగిస్తున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా క్రికెట్ లెజెండ్ సౌరవ్ గంగూలీ దంపతులైతే ఏకంగా ప్రత్యక్ష నిరసనల్లో పాల్గొని న్యాయం కోసం గొంతెత్తారు. బుధవారం వైద్యుల చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో పాల్గొని.. వైద్యురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా గంగూలీ మీడియాతో మాట్లాడారు.. కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై సీబీఐ త్వరితగతిని దర్యాప్తు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో ఈ మధ్య ఇలాంటి కేసులు భయంకరంగా జరుగుతున్నాయని వాపోయారు. బాధితురాలికి న్యాయం జరగాలి.. ఆమె కుటుంబానికి న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. ర్యాలీలో గంగూలీతో పాటు భార్య డోనా గంగూలీ కూడా వెంట నడిచారు.
Also Read
- ECI on SIR Row: ఓటర్ల జాబితా SIRపై రగడ.. అంతర్గత విభేదాల వార్తలను తోసిపుచ్చిన ఈసీ
- Ajith Kumar Fans: అజిత్ అభిమానుల సంచలన నిర్ణయం.. తమిళనాడులో మరో పార్టీ ఎంట్రీ!
- Patna Shocker: సర్వీస్ రివాల్వర్‌తో సోదరిపై కాల్పులు.. ఆపై తానూ షూట్ చేసుకున్న కానిస్టేబుల్
- Azamgarh Encounter: భార్య, కుమారుడు, ఇద్దరు పూజారుల హత్య.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
ఆగస్టు 9న కోల్‌కతా ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో అత్యంత క్రూరంగా వైద్యురాలు హత్యాచారానికి గురైంది. ఆమె కళ్లు, ప్రైవేటు భాగాల నుంచి విపరీతంగా రక్తస్రావం జరిగింది. అంతేకాదు.. శరీరమంతా గాయాలతో నిండిపోయింది. ఇక పోస్టుమార్టం రిపోర్టులో అయితే ఆమెలో 150 మిల్లీగ్రాముల వీర్యం ఉన్నట్లుగా గుర్తించారు. అంటే ఆమెపై గ్యాంగ్‌రేప్ జరిగినట్లుగా భావిస్తున్నారు. ఇక ఈ ఘటన జరిగిన తర్వాత రౌడీలు, గూండాలు ఆస్పత్రిలోకి వెళ్లి ఆధారాలు చెరిపేశారు. కోల్‌కతా హైకోర్టు జోక్యంతో సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు చేస్తోంది. లోతుగా విచారిస్తోంది. ప్రధానంగా మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోస్‌ను లోతుగా విచారిస్తున్నారు. ఇతడు భయంకరంగా మాఫియాను నడిపిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు.
తాజావార్తలు
-
Asian Games 2026: 28 ఏళ్ల నిరీక్షణకు తెర.. చరిత్ర సృష్టించిన మిరాబాయి చాను.. ఆసియా క్రీడల్లో రజతం కైవసం
-
Bajaj Wego C90: చిన్న వ్యాపారులకు Bajaj Wego C90 ఎలక్ట్రిక్ కార్గో.. 207KM రేంజ్.. 12.1kWh బ్యాటరీ
-
The Paradise : నాని ‘ది ప్యారడైజ్’ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
ECI on SIR Row: ఓటర్ల జాబితా SIRపై రగడ.. అంతర్గత విభేదాల వార్తలను తోసిపుచ్చిన ఈసీ
ట్రెండింగ్
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!