BRS Leaders Protest: సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. జాయింట్ సీపీకి బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు
- సైబరాబాద్ సీపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత
- సీపీ ఆఫీస్‌కు వెళ్లిన హరీష్‌రావు.. బీఆర్‌ఎస్ నేతలు
- కౌశిక్ రెడ్డి నివాసం దాడి ఘటనపై బీఆర్‌ఎస్ నేతల ఫిర్యాదు
- సీపీ లేకపోవడంతో జాయింట్ సీపీకి ఫిర్యాదు చేసిన బీఆర్‌ఎస్ నేతలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సైబరాబాద్ సీపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. కౌశిక్ రెడ్డి నివాసం దాడి ఘటనపై ఫిర్యాదు చేసేందుకు హరీష్‌రావు, బీఆర్‌ఎస్ నేతలు సీపీ ఆఫీస్‌కు వెళ్లారు. సీపీ ఆఫీస్‌లోకి ముగ్గురు ఎమ్మెల్యేలకు అనుమతి ఇచ్చారు. దీంతో.. ఎమ్మెల్యేలందరినీ అనుమతించాలంటూ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. సీపీ ఆఫీస్‌లోని మెట్లపై బైఠాయించి బీఆర్‌ఎస్ ఆందోళన చేశారు. దాడి ఘటనపై ఫిర్యాదు చేసేందుకు వెళ్తే.. సీపీ లేకపోవడంతో జాయింట్ సీపీకి బీఆర్‌ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి లిఖిత పూర్వక ఫిర్యాదు రాసి ఇచ్చారు.
Read Also: Mysuru: లెహ్‌కు ట్రెక్కింగ్‌కి వెళ్లి శ్వాస అందక మైసూర్ ఇంజనీర్ మృతి
Also Read
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై దాడి చేసిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కాంగ్రెస్ అనుచరులను అరెస్టు చేసేదాకా ఇక్కడ నుంచి వెళ్ళేది లేదని సీపీ కార్యాలయంలో మాజీ మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. దగ్గరుండి దాడిని ప్రోత్సహించిన సీఐ, ఏసీపీలను వెంటనే సస్పెండ్ చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని లిఖిత పూర్వంగా కౌశిక్ రెడ్డి ఫిర్యాదు చేశారు.
Read Also: CM Chandrababu: సీతారాం ఏచూరి మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం
ఫిర్యాదులోని అంశాలు:
– ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై హత్యాయత్నం చేసిన వారిని తక్షణం అరెస్ట్ చేయాలి.
– ఉద్దేశ పూర్వక దాడి వెనక పోలీసుల వైఫల్యం ఉంది. DCP, ACP, CI లను సస్పెండ్ చేయాలి..
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు