Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండి పట్టణంలో ఆక్రమిత స్థలంలో నిర్మించిన సంజౌలీ మసీదును కూల్చివేయాలని డిమాండ్ చేస్తున్న నిరసనకారులపై పోలీసులు నిన్న (శుక్రవారం) నీటి ఫిరంగులతో పాటు లాఠీచార్జీ చేశారు. దీనికి నిరసనగా నేడు (శనివారం) రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కు హిందూ సంస్థలు పిలుపునిచ్చాయి. బంద్ నేపథ్యంలో హిమాచల్ లోని వ్యాపారులంతా తమ దుకాణాలను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు మూసి ఉంచాలని హిందూ సంస్థ నేత కమల్ గౌతమ్ కోరారు. సిమ్లాలోని సంజౌలీలో నిరసన వ్యక్తం చేస్తున్న వారిపై పోలీసుల లాఠీచార్జికి వ్యతిరేకంగా సమూహిక బంద్ కు పిలుపునిచ్చిట్లు వెల్లడించారు. అలాగే, పలు రాష్ట్రాల్లోని ప్రధాన ప్రాంతాల్లో నిరసనలు తెలుపుతామని హిందూ సంఘాలు హెచ్చరించాయి.
Read Also: Pawan Kalyan: పవన్ కల్యాణ్‌పై ప్రశ్న.. 1.60 లక్షలు గెలుచుకున్న కంటెస్టెంట్!
ఇక, సెప్టెంబర్ 11వ తేదీన ఉదయం సంజౌలిలో పెద్ద సంఖ్యలో హిందూ సంఘాలకు చెందిన వారు ఆందోళనలు చేపట్టారు. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని సిమ్లా జిల్లా అధికార యంత్రాంగం సెక్షన్ 163ని అమలు చేస్తుంది. ఇందులో భాగంగా ఐదుగురి కంటే ఎక్కువ మంది ఉండొద్దని షరతులు విధించింది. అయితే, ఆందోళనకారులు ఢిల్లీ టన్నెల్ దగ్గరున్న బారికేడింగ్‌ను ఢీ కొట్టి, సంజౌలి వైపు వెళ్లారు. ఈ సందర్భంగా ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జి చేసి, వాటర్ ఫిరంగులను ప్రయోగించారు. దీనికి నిరసనగా ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు విసిరారు.