బాలీవుడ్ స్టార్ హీరోయిన్, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తన నిక్ జోనస్ తో కలిసి న్యూయార్క్ నగరంలో నివాసం ఉంటున్న విషయం తెలిసిందే. హాలీవుడ్ లో తన తొలి టీవీ షో ‘క్వాంటికో’ ద్వారా వార్తల్లో నిలిచిన ఈ హాట్ బ్యూటీ ఇప్పుడు పలు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. పాప్ స్టార్ నిక్ జోనస్ ను వివాహం చేసుకున్న ఈ భామ యూఎస్ లో అత్యంత ఖరీదైన బంగ్లా కొని సంచలనం సృష్టించింది. అయితే…
గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఫుల్ వైట్ అండ్ వైట్ డ్రెస్ లో అద్భుతమైన లుక్ లో దర్శనమిచ్చింది. లండన్లో చాలా కాలం గడిపి తాజాగా యుఎస్ తిరిగి వచ్చిన ప్రియాంక ఇప్పుడు పలు ప్రాజెక్ట్ లతో చాలా బిజీగా ఉంది. రెస్ట్ లేకుండా పని చేస్తున్న ఈ బ్యూటీ ప్రస్తుతం కొంత విరామం తీసుకోవాలని భావించి న్యూయార్క్ లోని తన ఫ్యామిలీని చేరింది. అక్కడ తన ప్రియమైనవారితో సమయం గడపడంలో బిజీగా ఉంది. ఈ వీకెండ్…
సోషల్ మీడియా వచ్చాక ఫ్యాన్స్ కి, వారి ఫేవరెట్స్ కి మధ్య దూరం పూర్తిగా తొలగిపోయింది. అందుకే, తన తాజా వీడియోలో ప్రియాంక చోప్రా ‘నేను బ్యాడ్ గాళ్ నా? లేక గుడ్ గాళ్ నా?’ అంటూ సరదాగా ప్రశ్నించింది! అఫ్ కోర్స్, ఇన్ స్టాగ్రామ్ లో ఆమె డై హార్డ్ ఫాలోయర్స్ ‘గుడ్ గాళ్’ అనే అన్నారు. కానీ, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే పీసీ తాను నేరుగా జనం ముందుకు రాలేదు. ఓ డిస్నీ క్యారెక్టర్…
‘విక్టోరియాస్ సీక్రెట్’… కాస్త ఇంటర్నేషనల్ బ్రాండ్స్ గురించి తెలిసిన అందరికీ… దీని గురించే తెలిసే ఉంటుంది. స్త్రీలకు సంబంధించిన లోదుస్తుల విషయంలో సూపర్ క్రేజీ బ్రాండ్! ప్రపంచ వ్యాప్తంగా పేరున్న ‘విక్టోరియాస్ సీక్రెట్’తో ఇప్పుడు మన దేసీగాళ్ ప్రియాంక కూడా చేతులు కలుపుతోంది!పెళ్లి తరువాత ప్రియాంక జోనాస్ గా మారి అమెరికాలో సెటిలైన ఇండియన్ గ్లోబల్ బ్యూటీ రోజుకొక కొత్త విజయాన్ని అందుకుంటోంది. టెలివిజన్ షోలతో మొదలు పెట్టిన పీసీ పాప్ సాంగ్స్ పాడటం, సినిమాల్లో నటించటం,…
బాలీవుడ్ లో బయోగ్రఫీల ట్రెండ్ సాగుతూనే ఉంది. రోజుకొకరు ఎవరో ఒక ప్రముఖ వ్యక్తి బయోపిక్ తీస్తానంటూ ప్రకటనలు చేస్తున్నారు. కొన్నాళ్ల క్రితమే సైనా బయోపిక్ తో పరిణీతి చోప్రా మన ముందుకొచ్చింది. ఇక తాప్సీ ప్రస్తుతం మిథాలీ రాజ్ గా తెరపై కనిపించే ప్రయత్నాల్లో ఉంది. మరో వైపు, దర్శకుడు మహేశ్ మంజ్రేకర్ ‘వీర సావర్కర్’ జీవితగాథ తెరపైన చూపిస్తానంటూ లెటెస్ట్ గా అనౌన్స్ చేశాడు. ఇప్పుడు బయోపిక్ రేసులోకి గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా…
బాలీవుడ్ భాయ్ జాన్ డిగ్రీ చదవకుండానే కాలేజీకి బైబై చెప్పేశాడు. మన మాటల్లో చెప్పుకోవాలంటే ఇంటర్ వరకే చదివాడు! బీ-టౌన్ నంబర్ వన్ బ్యూటీ దీపికా కూడా పన్నెండో తరగతితోనే చదువుకి సెండాఫ్ ఇచ్చేసింది. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోసం ఓ యూనివర్సిటీలో ఎన్ రోల్ అయినా ఎన్నో రోజులు కోర్స్ కంటిన్యూ చేయలేకపోయింది!మిష్టర్ పర్ఫెక్షనిస్ట్ గా పేరు తెచ్చుకున్న ఆమీర్ ఎడ్యుకేషన్ దగ్గరకొచ్చేసరికి మాత్రం ఇమ్ పర్ఫెక్టే! ఈయన కూడా క్లాస్ ట్వల్ దగ్గరే చదువుకి టాటా…
ప్రియాంక్ చోప్రా భర్త నిక్ జోన్స్ టెలివిజన్ షూటింగ్ లో గాయపడ్డాడు. శనివారం ఈ సంఘటన జరిగింది. వెంటనే అంబులెన్స్ లో హాస్పిటల్ కు తీసుకుని వెళ్ళారు. అయితే గాయం చిన్నదే కావటంతో ఆదివారం నిక్ మళ్ళీ తన సింగింగ్ షో ‘ద వాయిస్’ షూటింగ్ లో పాల్గొన్నాడు. కరోనా సెకండ్ వేవ్ ఇండియాలో తీవ్రంగా ఉండటంతో ప్రియాంక, నిక్ సహాయం కోసం నిధిని కలెక్ట్ చేస్తున్నారు.
ప్రతి శుక్రవారం సినిమాల విడుదలతో స్టార్స్ హీరోలు, హీరోయిన్ల పొజిషన్స్ మారిపోతాయని అంటూ ఉంటారు. అలానే ఒకే ఒక్క ఫోటో లేదా వీడియోతో సోషల్ మీడియాలో సదరు స్టార్ హీరోలు, హీరోయిన్ల ఫాలోవర్స్ సంఖ్యలో భారీ మార్పులు చేటు చేసుకుంటాయి. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో 62.6 మిలియన్ ఫాలోవర్స్ తో ప్రియాంక చోప్రా అగ్ర స్థానంలో నిలువగా, ద్వితీయ స్థానంలో 61.1 మిలియన్ ఫాలోవర్స్ తో శ్రద్ధాకపూర్ నిలిచింది. దీపికా పదుకొనే 55.8 మిలియన్ ఫాలోవర్స్…
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా… ఇప్పుడు ఎల్లలు దాటేసి హాలీవుడ్ లోనూ తన సత్తా చాటుతోంది. అంతేకాదు భర్త నిక్ జోనాస్ తో కలిసి అంతర్జాతీయ వేదికలపై హంగామా సృష్టిస్తోంది. అవకాశం చిక్కాలే కానీ పిగ్గీ చాప్స్ తన అందాల ఆరబోతతో అభిమానులను మెస్మరైజ్ చేస్తుంటుంది. సరిగ్గా అలాంటి ఛాన్స్ తాజాగా అమ్మడికి లండన్ లోని బాప్టా అవార్డ్స్ వేడుకలో దక్కింది. రాయల్ ఆల్బర్ట్ హాల్ లో జరిగిన ఈ వేడుకకు ప్రియాంక, తన భర్త…