బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉన్నారు. శుక్రవారం ఆమె షేర్ చేసిన ఫోటోలపై చర్చ మొదలైంది. ప్రియాంక పోస్ట్ చేసిన చిత్రాలలో ఆమె గాయపడినట్లు తెలుస్తోంది. ఆ పిక్స్ చూశాక ఆమె అభిమానులు చాలా ఆందోళన చెందుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలోఆ ఫోటోలను పంచుకుంది ప్రియాంక. అందులో ఆమె ముఖంపై గాయంతో పాటు, మట్టి కూడా ఉంది. రెండవ పిక్ లో ఆమె నుదిటి నుండి రక్తం కారడాన్ని చూడవచ్చు. షూటింగ్ సమయంలో తాను గాయపడినట్లు ప్రియాంక స్వయంగా వెల్లడించింది. ప్రస్తుతం ప్రియాంక ‘సిటాడెల్’ సినిమా కోసం షూటింగ్ లో పాల్గొంటోంది. సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన ఈ పిక్స్ ఈ సినిమా షూటింగ్ సమయంలోనివే. యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తునప్పుడు ప్రియాంకకు గాయాలు అయినట్టు సమాచారం. ఐ బ్రో పై గాయం లోతుగానే తగిలింది. ఆ పిక్స్ చూసిన ఆమె అభిమానులు తన ఆరోగ్యం, శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని కోరుతున్నారు.
Read also : “పుష్ప”లో మరో టాలీవుడ్ విలన్
ప్రియాంక చోప్రా త్వరలో ‘సిటాడెల్’ లో కనిపిస్తుంది. దీనితో పాటు ఆమె టామ్ క్రూయిస్ “మిషన్ ఇంపాజిబుల్ 7″లో కూడా నటిస్తోంది. బాలీవుడ్‌లో కత్రినా కైఫ్, అలియా భట్ లతో కలిసి “జీ లే జారా” చిత్రంలో ప్రధాన పాత్రను పోషిస్తోంది. ఆమె అమెరికాలో స్థిరపడినప్పటికీ బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తూనే ఉంది. ఈ బ్యూటీ సినిమాలు చేస్తూనే తన కొత్త వ్యాపారాన్ని ఇటీవల ప్రారంభించింది. న్యూయార్క్‌లో తన సొంత రెస్టారెంట్‌ను స్టార్ట్ చేసింది. ఈ రెస్టారెంట్ పేరు సోనా. ఈ విలాసవంతమైన రెస్టారెంట్‌లో అనేక రకాల భారతీయ వంటకాలు రుచి చూపిస్తున్నారు.