మ్యాట్రిక్స్ రీసరెక్షన్స్‌లో ప్రియాంక ఫస్ట్ లుక్ రిలీజ్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రియాంక చోప్రా తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో భర్త జోనాస్ పేరు తొలగించటంతో ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లో ఉంది. అయితే మంగళవారం తను నటించిన హాలీవుడ్ చిత్రం ‘ది మ్యాట్రిక్స్ రిసరెక్షన్స్’ నుండి తన క్యారెక్టర్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను షేర్ చేసింది ప్రియాంక. కీను రీవ్స్, క్యారీ అన్నే మోస్ వంటి హాలీవుడ్ తారలు నటించిన ఈ సక్సెస్ ఫుల్ సీక్వెల్ లో ప్రియాంక లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. మాట్రిక్స్ సీరీస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సైన్స్ ఫిక్షన్ చిత్రం ఫస్ట్ పోస్టర్ లో ప్రియాంక లేకపోవడం అమ్మడి అభిమానులను నిరాశగు గురిచేసింది.
అయితే ఆ తర్వాత సెప్టెంబర్‌లో వార్నర్ బ్రదర్స్ రిలీజ్ చేసిన అఫీషియల్ ట్రైలర్‌లో మాత్రం మెరుపులా మెరిసింది ప్రియాంక. ఇప్పుడు తాజా పోస్టర్ లో తన లుక్ ని షేర్ చేస్తూ ‘నేను ఇక్కడ ఉన్నాను. #TheMatrix 12.22.21ని రీ ఎంటర్ చేయండి. పలువురు నెటిజన్లు ఇందులో నా పాత్రను ఊహించారు. సతీ పాత్రకు గ్రోన్ అప్ వెర్షన్ అని అంటున్నారు. మరికొందరు మ్యాట్రిక్స్‌లో నేను ఒరాకిల్ కావచ్చంటున్నారు’ అని ట్వీట్ చేసింది. అయితే ఇప్పటివరకు, ప్రియాంక తను ఏ పాత్ర పోషిస్తుందో తెలియచేయలేదు. అయితే ఖచ్చితంగా ఇందులో ఆమె గేమ్‌చేంజర్‌గా మాత్రం ఉంటుందట. మ్యాట్రిక్స్ రీసరెక్షన్స్ లో నియోగా కీను రీవ్స్, ట్రినిటీగా క్యారీ అన్నే మోస్, నియోబ్‌గా జాడా పింకెట్ స్మిత్ తో పాటు కొత్తగా ప్రియాంక చోప్రా, యాహ్యా అబ్దుల్ మతీన్ 2, నీల్ పాట్రిక్ హారిస్, జోనాథన్ గ్రాఫ్, క్రిస్టినా రిక్సీ ఉన్నారు. జెస్సికా హెన్విక్ కనిపించనున్నారు. లానా వాసోస్కి దర్శకత్వం వహిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మరి ఈ సినిమా ప్రియాంకకు ఎలాంటి పేరు తెచ్చిపెడుతుందో చూడాలి.
Also Read
- SIIMA 2026 Nominations: సైమా 2026 నామినేషన్స్ వచ్చేశాయ్.. తెలుగు నుంచి ఈ సినిమాదే హవా!
- Kajal Aggarwal: "అతను నా పర్మిషన్ లేకుండానే కారవాన్‌లోకి వచ్చాడు".. తర్వాత ఏం జరిగిందో చెప్పిన కాజల్ అగర్వాల్!
- Sumanth: 'నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు..' అంత మాట అనేశాడేంటి?
- NBK111: సర్జరీ అయినా తగ్గేదేలే.. బాలయ్య మొండితనానికి ఫ్యాన్స్ ఫిదా! అక్టోబర్ 1 నుంచి NBK111 షూటింగ్?
తాజావార్తలు
-
SIIMA 2026 Nominations: సైమా 2026 నామినేషన్స్ వచ్చేశాయ్.. తెలుగు నుంచి ఈ సినిమాదే హవా!
-
ఇండియాలో EMI కల్చర్ ఎలా మొదలైందో తెలుసా? భారతదేశాన్ని మార్చిన ఆ వ్యక్తి ఇతనే!
-
Metro Express: కరీంనగర్లో ‘సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్’ బస్సులు ప్రారంభం.. ఈ రూట్లల్లో అందుబాటులోకి..
-
Sai Krishna Lockup Death Case: సీఐ నాగరాజుపై సుదీర్ఘ విచారణ.. ప్రశ్నల వర్షం కురిపించిన SIT..
-
YS Jagan: సీదిరి అప్పలరాజు కుటుంబంపై కక్ష సాధింపు.. ప్రమాదాన్ని కుట్రగా మార్చారు.!
ట్రెండింగ్
-
WhatsApp Webలో ఆడియో, వీడియో కాలింగ్ సపోర్ట్.. Call Transfer, Waiting Room సహా కొత్త ఫీచర్స్ కూడా.!
-
7,200mAh బ్యాటరీ, Dimensity 7400 Turbo చిప్‌తో vivo T5x 5G కొత్త Fusion Red కలర్ వేరియంట్ లాంచ్..!
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!
-
Ajinkya Rahane Retirement: అజింక్య రహానే రిటైర్మెంట్.. ఇకపై క్రికెట్ ఆడనంటూ భావోద్వేగ పోస్ట్!
-
Vaibhav Sooryavanshi: నేను ఏ బౌలర్‌కు భయపడను.. వారే నన్ను చూసి వణికిపోతున్నారు!