Kurnool Bus Accident: కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం అంతా ఉలిక్కి పడేలా చేసింది.. ఈ ఘటనతో అసలు ఆర్టీఏ అధికారులు ఏం చేస్తున్నారు..? ప్రయాణికుల రక్షణ కోసం ప్రభుత్వాలు ఏం చర్యలు తీసుకుంటున్నాయే విమర్శలు కూడా వచ్చాయి.. అయితే, ఆర్టీఏ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు.. బస్సులకు సంబంధించిన ఫిట్నెస్ సర్టిఫికేట్, ఆర్‌సీ, బీమా, పర్మిట్, పన్ను, డబుల్ డ్రైవర్, ఎస్కార్ట్ ఫైర్ ఎక్స్‌టింజిషర్ తో పాటు ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ ఇలా.. క్షుణ్ణంగా…
Transport Deportment: సంక్రాంతి పండుగా సందర్భంగా రవాణా శాఖ ప్రైవేట్ ట్రావెల్స్ పై భారీగా దాడులు నిర్వహించింది. జనవరి 6 నుండి 18 వరకు, హైదరాబాద్ నగరవ్యాప్తంగా 317 కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. వివిధ కారణాలతో నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేట్ ట్రావెల్స్, కాంట్రాక్టు బేస్డ్ బస్సులపై రవాణా శాఖ అధికారులు సీరియస్ చర్యలు తీసుకున్నారు. రవాణా శాఖ కాంట్రాక్టు క్యారేజీ బస్సులపై భారీగా జరిపిన చలాన్లు వసూలు చేసింది. మొత్తం లక్షా 11 వేల…
నిబంధనలు ఉల్లంఘించిన 250కి పైగా ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేసినట్లు రవాణా శాఖ కమిషనర్ తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండలోని వివిధ ప్రాంతాల్లో అధికారులు బృందాలుగా ఏర్పడి వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఇంకా తనిఖీలు కొనసాగిస్తున్నట్లు రవాణా శాఖ కమిషనర్ వెల్లడించారు. పర్మిట్ నిబంధనలు ఉల్లంఘించి ప్రయాణిస్తున్న వాహనాలు, ఇతర నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేట్ బస్సులపై ఇప్పటి వరకు 250 పైగా కేసులు నమోదు చేశారు.
Transport Officer: NTVతో రంగారెడ్డి జిల్లా ఉప రవాణా శాఖ అధికారి సదానందం మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై గత మూడో రోజులుగా తనిఖీలు కొనసాగిస్తున్నామని తెలిపారు.
సెంటిమెంటుని, పండుగల్ని దోచుకునే దందాలో ప్రైవేట్ ట్రావెల్స్ ముందుంటాయనేది ఎప్పట్నుంచో వినిపిస్తున్న మాట! ఫెస్టివల్కి ఇంటికి వెళ్తున్నామన్న సంతోషమే ఉంచరు! పైసో, పరకో పట్టుకెళ్దామన్న ఆశను నిలువునా కూల్చేస్తారు. అడ్డగోలుగా దోచుకుంటారు. అసలు పండుగ వచ్చేది జనాలకు కాదు.. ఇలాంటి ప్రైవేట్ ట్రావెల్స్‌కు! టికెట్ రేటు విషయంలో వాళ్ల నోటికి మొక్కాలి! పెంచే రేట్లకు పద్ధతీ పాడూ లేదు.
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సమరం తుది దశకు చేరుకుంది. ఇవాళ్టితో ప్రచారానికి తెర పడనుంది. మరో రెండు రోజుల్లో అంటే మే 13న పోలింగ్ జరుగుతుంది. ఎన్నికల వేళ ప్రైవేట్ ట్రావెల్స్ రెచ్చిపోతున్నాయి. ప్రయాణికులను అడ్డంగా దోచేస్తున్నాయి. ఉద్యోగాలు, చదువుల పేరుతో ప్రజలు సొంత ఊర్లకు దూరంగా ఎక్కడెక్కడో సెటిల్ అయిన జనాలు.. సొంత ఊర్లకు పయనం అవుతున్నారు. శనివారం నుంచి సోమవారం వరకు వరుసగా సెలవులు ఉండటంతో.. ఓటేయడం కోసం తమ ప్రాంతాలకు వెళ్తున్నారు. ఆర్టీసీ…
తెలంగాణ రాష్ట్రంలో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ పై కొరడా ఝులిపించేందుకు రవాణా శాఖ సిద్దమవుతుంది. విజయవాడ, వైజాగ్, బెంగుళూరు రూట్స్ లో ఎక్కువ వసూలు చేస్తున్నట్టు తెలిసింది.. అందుకే స్పెషల్ డ్రైవ్ కూడా చేపట్టామని జాయింట్ ట్రాన్ పోర్ట్ కమిషనర్ రమేష్ అన్నారు. అందులో 79 బస్సుల పైన చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. వీటిల్లో రూ.35 వేల జరిమానా కూడా విధించినట్లు ఆయన పేర్కొన్నారు.
పండగ సమయంలో ప్రైవేట్ ట్రావెల్స్ అడ్డగోలుగా దోపిడీకి పాల్పడుతున్నారు. టికెట్ రేట్లను వారికి ఇష్టం వచ్చినంత పెంచి వసూలు చేస్తున్నారు. తెలంగాణ నుంచి ఏ ప్రాంతానికి వెళ్లాలన్నా.. ప్రైవేట్ టికెట్ ధరలకు రెక్కలొచ్చాయి. ఓ వైపు సంక్రాంతి.. మరోవైపు శనివారం, ఆదివారం కలిసి రావడంతో ఖర్చును సైతం లెక్క చేయకుండా సొంత ఊర్లకు వెళ్లడానికి జనాలు ఆసక్తి చూపుతున్నారు. ఇదే అదునుగా భావించిన ప్రైవేట్ ట్రావెల్స్.. ప్రయాణికుల నుంచి అధికంగా డబ్బులు రాబడుతున్నారు.
JTC Venkateswara Rao: సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ప్రైవేట్ ట్రావెల్స్‌కు అసలైన పండుగ.. ప్రయాణికులను రద్దీని దృష్టిలో పెట్టుకుని భారీగా చార్జీలు పెంచి సొమ్ము చేసుకుంటున్న ఘటనలు చూస్తూనే ఉన్నాయి.. అయితే, పండుగ సమయంలోనూ సాధారణ చార్జీలే వసూలు చేస్తోంది ఆర్టీసీ.. అదే సమయంలో.. ఒకేసారి అప్ అండ్ డౌన్ టికెట్లు బుక్‌చేసుకునేవారికి రాయితీ కూడా కల్పిస్తోంది. అయితే, ఈ ఏడాది కూడా ప్రైవేట్ ట్రావెల్స్ చార్జీలను భారీ పెంచే అవకాశం ఉండడంతో.. అప్రమత్తం అయ్యారు…