Transport Officer: NTVతో రంగారెడ్డి జిల్లా ఉప రవాణా శాఖ అధికారి సదానందం మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై గత మూడో రోజులుగా తనిఖీలు కొనసాగిస్తున్నామని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఇప్పటి వరకు 150 ప్రైవేట్ బస్సులపై కేసు నమోదు చేశాం.. మరి కొన్ని బస్సులు సీసీ చేశామని పేర్కొన్నారు. అలాగే, రాజేంద్రనగర్, ఆరంఘర్ చౌరస్తా వద్ద ప్రైవేటు ట్రావెల్స్ తనిఖీలు చేసినప్పుడు 11 బస్సులపై కేసు నమోదు చేయగా.. మరో బస్సు సీజ్ చేశామన్నారు. సంక్రాంతి పండగ సందర్భంగా ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న వాటిపైనే ప్రత్యేక దృష్టి పెట్టామని రంగారెడ్డి జిల్లా డిప్యూటీ ఆర్టీఏ అధికారి సదానందం చెప్పారు.
Read Also: Game Changer : గేమ్ ఛేంజర్ ఫస్ట్ డే కలెక్షన్స్.. ఆ రెండు సినిమాలు ఔట్
అలాగే, పర్మిట్ కు మించి ప్రయాణికులను అలో చేయడం, తెలంగాణకు టాక్స్ ఎగ్గొట్టడంతో పాటు ప్యాసింజర్లకు ఇక్కట్లు పెట్టినట్లు మా దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రంగారెడ్డి జిల్లా ఉప రవాణా శాఖ అధికారి సదానందం హెచ్చరించారు. చెన్నై, తిరువంతపురం, పాండిచ్చేరి, మంగళూరు, మైసూరు, కన్యాకుమారి బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న బస్సులను సైతం తనిఖీలు చేస్తున్నామని పేర్కొన్నాడు. ఇక, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై క్రమంగ కేసులు నమోదు చేస్తామి వెల్లడించారు.
Read Also: Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా జట్టు ప్రకటన మరింత ఆలస్యం!
ఇక, ఏకకాలంలో 10 సెంటర్లలో రవాణా శాఖ అధికారులు దాడులు చేశారు. నిన్న రాత్రి నుంచి ఇవాళ ఉదయం వరకు అనేక ప్రైవేట్ బస్సులను జేటీసీ చంద్రశేఖర్ గౌడ్ తనిఖీలు చేశారు. రాజేంద్రనగర్, ఆరంఘర్ చౌరస్తా, ఉప్పల్, ఎల్బీనగర్ తో పాటు నగర శివారు ప్రాంతాలలో తనిఖీలు ఉదయం వరకు కొనసాగాయి. రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో కొన్ని ప్రైవేటు ట్రావెల్స్ పై ఆర్టీఏ అధికారులు కొరడా ఝలిపించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న 150 బస్సులపై రవాణాశాఖ అధికారులు కేసు నమోదు చేశారు.