వరల్డ్ ఉమెన్ బాక్సింగ్ ఛాంపియన్ గా నిలచిన నిఖత్ జరీన్ ఈ రోజు ప్రధాని మోదీని కలిసింది. గత నెలలో టర్కీలో జరిగిన పోటీలో
ఫైనల్స్ లో థాయ్ లాండ్ కు చెందిన జిట్పాంగ్ జుతామస్ ను మట్టికరిపించి, బంగారు పథకం గెలిచి వరల్డ్ ఛాంపియన్ గా గెలిచిన జరీన్ దేశ ఖ్యాతిని ప్రపంచ నలుమూలలకు విస్తరింపజేసింది. అయితే నిఖత్ జరీన్ తో పాటు మానిషా మౌన్, ప్రవీన్ హుడాలు కూడా ప్రధానిని కలిశారు. ప్రధానితో కాసేపు ముచ్చటించారు. ప్రధానితో కలిసిన అనంతరం మోదీతో సెల్ఫీ కూడా దిగింది. అనంతరం ట్విట్టర్ వేదికగా తన ఆనందాన్ని పంచుకుంది జరీన్. ‘‘మన ప్రధాన మంత్రిని కలవడం చాలా గౌరవంగా ఉందని థాంక్యూ సార్’’ అంటూ ట్వీట్ చేసింది.
తెలంగాణలోని నిజామాబాద్ కు చెందిన నిఖత్ జరీన్ ఇండియా తరుపున బాక్సింగ్ ఛాంపియన్ గా నిలిచిన ఐదో మహిళ గా నిలిచింది. నిఖత్ జరీన్ కు ముందు భారత్ తరుపున మేరీ కోమ్, సరితాదేవి, జెన్నీ ఆర్ఎల్, లేఖ కేసీలు ఈ ఘనతను సాధించారు.
An honour to meet our Hon’ble PM @narendramodi sir.
Thank you sir😊🙏🏻 pic.twitter.com/8V6avxBG9O— Nikhat Zareen (@nikhat_zareen) June 1, 2022