తమిళనాడులో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ అంత్యక్రియలు ఈరోజు ఢిల్లీలో జరగనున్నాయి. ఢిల్లీలోని కామరాజ్ మార్గ్‌లో ఉన్న బిపిన్ రావత్ ఇంటి వద్ద ఆయన మృతదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు. అనంతరం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. బిపిన్ రావత్ సహా ఘటనలో మృతి చెందిన 13 మందికి దేశమంతా నివాళులు అర్పిస్తోంది. బిపిన్ రావత్ భౌతికకాయానికి ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర విమానయాన శాఖ…
తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలని కోరుతూ ప్రధాని మోదీకి తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన నీటిపారుదల ప్రాజెక్టు కాళేశ్వరం, మరో ప్రాజెక్టు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలలో ఒకదానికి జాతీయ హోదా ఇవ్వాలని తన ట్వీట్‌లో కేటీఆర్ పేర్కొన్నారు. ఏపీలోని పోలవరం, కర్ణాటకలోని ఎగువ భద్ర ప్రాజెక్టులకు ఇచ్చిన ప్రాధాన్యత తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు కూడా ఇవ్వాలని కేటీఆర్ కోరారు. తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టుల్లో ఒకదానికి జాతీయ హోదా ఇవ్వాలని ఇప్పటికే…
దేశంలో గత ఏడాది కాలంగా డిజిటల్ లావాదేవీలు గణనీయంగా పెరిగాయని ప్రధాని మోదీ వెల్లడించారు. శుక్రవారం ఉదయం ఫిన్‌టెక్ ఇన్ఫినిటీ ఫోరంలో మాట్లాడిన ఆయన… గత ఏడాది కాలంలో మొబైల్ చెల్లింపులు మొదటిసారిగా ఏటీఎం నగదు ఉపసంహరణలను మించిపోయాయని ట్విట్టర్ ద్వారా తెలిపారు. గత ఏడాది కాలంలో సుమారు 6.90 కోట్ల రూపే కార్డులను వినియోగదారులు తీసుకున్నారని… వాటి ద్వారా సుమారు 130 కోట్ల లావాదేవీలు జరిగాయని వివరించారు. Read Also: 2022: కొత్త ఏడాదిలో భారీగా…
దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. కరోనా టీకా రెండు డోసులు తీసుకున్న వారికి కూడా ఈ వేరియంట్ సోకుతోందని వార్తలు వస్తున్నాయి. కొత్త వేరియంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన ఈరోజు ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. కొత్త వేరియంట్‌పై అప్రమత్తంగా ఉండాలని ఈ సమావేశంలో ప్రధాని మోదీ సూచించారు. భారత్‌పై ఈ వేరియంట్ ప్రభావం ఎలా ఉంటుందనే విషయంపై అధికారులతో మోదీ చర్చించారు. Read…
ప్రధాని నరేంద్రమోదీ ఈ ఏడాది కూడా సైనికులతో కలిసే దీపావళి పండగ జరుపుకోనున్నారు. గత ఏడాది రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లోని లోంగేవాలా సరిహద్దు వద్ద సైనికులతో కలిసి దీపాలు వెలిగించారు. ఈ సారి ఆయన జమ్మూకశ్మీర్‌లో పర్యటించనున్నారు. ఇవాళ నౌషేరా, రాజౌరీ సరిహద్దు ప్రాంతాలకు వెళ్లనున్నారు. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన దగ్గరి నుంచి ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. 2019లో కూడా రాజౌరీ జిల్లాలోని నియంత్రణ రేఖ వద్ద బాధ్యతలు నిర్వర్తిస్తోన్న జవాన్లతో పండగ జరుపుకొన్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ…క్రైస్తవ మత గురువు పోప్ ఫ్రాన్సిస్‌ని కలవనున్నారు. ఇటలీలో జరిగే జీ-20 సమావేశానికి వెళ్లిన మోడీ…అటు నుంచి వాటికన్ సిటీకి వెళ్లి పోప్ ఫ్రాన్సిస్‌ని కలవనున్నట్లు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి హర్ష్ వర్ధన్ శ్రింగ్లా తెలిపారు. అయితే ఇది ఇంకా ఫైనల్ కాలేదు…ఇరు వైపుల అధికారులు సమావేశం సమయాన్ని నిర్ణయించి షెడ్యూల్‌ను ప్రకటించనున్నారు. పోప్‌తో సమావేశంపై ప్రస్తుతం చర్చలు సాగుతున్నాయని… త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందని అధికారులు చెబుతున్నారు.…
ప్రధాని మోడీ విదేశీ పర్యటన ఖరారైంది. అక్టోబర్ 29 నుంచి నవంబర్ 2 వరకు విదేశీ పర్యటనలకు వెళ్లనున్నారు. రోమ్‌లో జరిగే జీ-20 శిఖరాగ్ర సదస్సులో ప్రధాని పాల్గొంటారు.ఈ నెల 29 నుంచి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు ప్రధాని మోడీ. ఇటలీ, బ్రిటన్‌లో పర్యటించనున్న ప్రధాని.. 6వ జీ-20, కాప్-26, వరల్డ్ లీడర్స్శిఖరాగ్ర సమావేశాలకు హాజరుకానున్నారు. మొత్తం 5 రోజులపాటు విదేశాల్లో ఉండనున్న మోడీ.. మొదట రోమ్‌కు వెళతారు. ఈనెల 30, 31వ తేదీల్లో ఇటలీ ప్రధాని…
2022 ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు ముచ్చింతల్‌లోని దివ్యసాకేతంలో 216 అడుగుల భగవద్రామానుజాచార్యుల మహా విగ్రహం ఆవిష్కరణకు.. ప్రధాని మోడీ హాజరుకానున్నారు. ఆ సమతా మూర్తి విగ్రహావిష్కరణకు హాజరు కావాలంటూ శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి ఆహ్వానాన్ని మన్నించారు ప్రధాని మోడీ.దేశం గర్వించే ఈ బృహత్కార్యంలో తాను తప్పక పాల్గొంటానన్నారు. ప్రపంచానికి సమతా సందేశాన్ని అందించే లక్ష్యంతో.. భగవద్రామానుజుల మహా విగ్రహాన్ని రూపొందించడం అభినందనీయమన్నారు ప్రధాని! ఈ మహాకార్యం సాకారం చేసిన చిన్నజీయర్ స్వామి సంకల్పాన్ని…
ప్రధాని నరేంద్ర మోదీతో గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ గురువారం భేటీ అయ్యారు. దాదాపు అరగంట పాటు సమావేశం జరిగింది. తెలంగాణ, పాండిచ్చేరి లోని తాజా పరిస్థితులు, ఇతర అంశాలపై చర్చించారు. ప్రధానికి పీఎం అండ్ పీఎం, మరో పుస్తకాన్ని గవర్నర్ తమిళ సై అందించారు. కోవిడ్ విపత్కర సమయంలో కేంద్రం నుంచి రాష్ట్రాలకు అన్ని విధాలుగా సహకారం అందిందని తమిళ సై తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్రం సమర్థవంతంగా అన్ని…
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీని మర్యాదపూర్వకంగా కలిశారు హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ. హర్యాణా గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా నేడు ఢిల్లీ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలిశారు బండారు దత్తాత్రేయ. ఈ సందర్భంగా గవర్నర్ బండారు దత్తాత్రేయ క్షేమ సమాచారాన్ని అడిగి తెలుకున్నారు ప్రధాన మంత్రి. అలాగే… హరియాణా రాష్ట్ర ప్రభుత్వం అమలుపరుస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను అడిగి తెలుసుకున్న ప్రధాని… కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో గవర్నర్లు క్రియాశీలక…