ఒక చాయ్‌వాలా దేశానికి ప్రధాని అయి, దేశ దిశ మార్చారంటే అది రాజ్యాంగం మనకు ఇచ్చిన గొప్ప వరం.. సాధారణ వ్యక్తి అయిన అబ్దుల్ కలాం రాష్ట్రపతి అయ్యారు.. భారత రత్న పొందారు.. పవర్ ఫుల్ రాష్ట్రపతిగా వ్యవహరించారని సీఎం చంద్రబాబు అన్నారు.
జీఎస్టీలో మార్పులు దేశాభివృద్ధిలో నిర్మాణాత్మక సంస్కరణలు అని ప్రధాని మోడీ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ నగర్‌లో ఏర్పాటు చేసిన సభలో మోడీ ప్రసంగించారు. యూపీఏ హయాంలో ట్యాక్స్‌ల మోత మోగిందని.. 2014 ముందు పన్నులతో ప్రజలకు నరకం చూపించారని ఆరోపించారు.
నరేంద్ర మోడీ.. భారతదేశ ప్రధాని. దేశ ప్రధానిగా సక్సెస్‌గా దూసుకుపోతున్నారు. ముచ్చటగా మూడోసారి విజయవంతంగా పరిపాలనను కొనసాగిస్తున్నారు. 2014 నుంచి ఏకధాటిగా భారతదేశ ప్రధానిగా మోడీ కొనసాగుతున్నారు.
ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తున్న దేశాల్లో ఫ్రాన్స్ కూడా ఉంది. ఇలాంటి తరుణంలో ఫ్రాన్స్‌లోనే పెద్ద రాజకీయ సంక్షోభం తలెత్తింది. దేశ రుణాన్ని తగ్గించడానికి సుమారు 52 బిలియన్లను తగ్గించాలనే ప్రణాళికలపై ప్రధానమంత్రి ఫ్రాంకోయిస్ బేరో నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు జాతీయ అసెంబ్లీ ఓటు వేసింది.
2029 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిగా చేయడమే లక్ష్యంగా ఇండియా కూటమి పని చేస్తుందని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అన్నారు. కేంద్ర ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ బీహార్‌లో ఓటర్ అధికార యాత్ర ప్రారంభించారు.
దేశ ప్రధానిగా మోడీ సరికొత్త రికార్డ్ సృష్టించారు. దేశ చరిత్రలో అత్యధిక రోజులు ప్రధానమంత్రిగా పని చేసిన రికార్డ్‌ను మోడీ సొంతం చేసుకున్నారు. శుక్రవారంతో 4,078 రోజులు పదవీకాలం పూర్తి చేసుకున్నారు.
ఆస్ట్రేలియా సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ విజయం సాధించారు. అధికార లేబర్ పార్టీ నాయకుడు 21 సంవత్సరాలలో వరుసగా రెండవసారి మూడేళ్ల పదవీకాలం గెలిచిన మొదటి ఆస్ట్రేలియా ప్రధానమంత్రి అయ్యాడు. కన్జర్వేటివ్ లిబరల్ పార్టీ నాయకుడు పీటర్ డట్టన్ తన డిక్సన్ స్థానాన్ని కూడా నిలుపుకోలేకపోయాడు. ఈ సీటును లేబర్ పార్టీ అభ్యర్థి గెలుచుకున్నారు. ఓటమిని అంగీకరిస్తూ, మేము బాగా రాణించలేదని అన్నారు. దీనికి నేను పూర్తి బాధ్యతను స్వీకరిస్తున్నాను అని పీటర్ డట్టన్…
ప్రధాని మోడీ ప్రైవేట్ కార్యదర్శిగా నిధి తివారీని కేంద్రం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వు జారీ చేసింది. 2022, నవంబర్ నుంచి ప్రధానమంత్రి కార్యాలయం (PMO)లో డిప్యూటీ సెక్రటరీగా నిధి తివారీ పనిచేస్తున్నారు.
Narendra Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం మారిషస్ పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా మారిషస్ లోని హిందువులను కలుసుకున్నారు. అందులో మెజార్టీ ప్రజలు భోజ్ పురి వాళ్లే ఉండటంతో వారిని ఉద్దేశించి ప్రధాని భోజ్ పురిలో బాగున్నారా అంటూ పలకరించారు. బీహార్ తో మీకున్న బంధాన్ని అర్థం చేసుకున్నానంటూ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా బీహార్ ఫేమస్ వంటకం అయిన మఖానా గురించి మాట్లాడారు. “ఇప్పుడు అందరూ బీహార్ వంటకం మఖానా గురించే…