ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు సోమవారం సాయంత్రం 4 గంటలకు ‘ది సబర్మతి రిపోర్ట్’ చిత్రాన్ని వీక్షించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై ప్రధాని ప్రశంసలు కురిపించారు. ఈ చిత్రంలో విక్రాంత్ మాస్సే ప్రధాన పాత్రలో నటించారు. గుజరాత్‌లోని గోద్రా ఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. న్యూఢిల్లీలోని బాలయోగి ఆడిటోరియంలో ప్రధానమంత్రి ఈ చిత్రాన్ని వీక్షిస్తారు.
ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలోని మెడికల్ కాలేజీలోని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్‌ఐసియు)లో శుక్రవారం రాత్రి (నవంబర్ 15) భారీ అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో పది మంది శిశువులు సజీవ దహనమయ్యారు.
Birsa Munda Jayanti: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేడు బిర్సా ముండా జయంతి సందర్భంగా ఆయన గిరిజన సమాజానికి ఓ ప్రత్యేక కానుకను అందించనున్నారు. దీని కింద మధ్యప్రదేశ్‌లో ఉన్న రెండు ‘గిరిజన స్వాతంత్య్ర సమర’ మ్యూజియంలను ప్రధానమంత్రి వర్చువల్‌గా ప్రారంభిస్తారు. భారత స్వాతంత్య్ర పోరాటంలో అద్భుతమైన చరిత్ర కలిగిన బిర్సా ముండా జయంతి ప్రతి సంవత్సరం నవంబర్ 15 న జరుపుకుంటారు. మధ్యప్రదేశ్ లోని చింద్వారా, జబల్‌పూర్ జిల్లాల్లో ఏర్పాటు చేసిన గిరిజన మ్యూజియంలను…
ప్రధాని మోడీ మరోసారి మూడు విదేశీ పర్యటనలకు వెళ్తున్నారు. నవంబర్ 16-21 తేదీల్లో నైజీరియా, బ్రెజిల్, గయానాలో పర్యటించనున్నారు. గతనెల అక్టోబర్‌లో మోడీ రష్యాకు వెళ్లి వచ్చారు. బ్రిక్స్ సమావేశంలో పాల్గొన్నారు. మరోసారి ఒకేసారి మూడు దేశాల్లో పర్యటించనున్నారు. 17 సంవత్సరాల్లో భారత ప్రధాని నైజీరియాలో పర్యటించడం ఇదే తొలిసారి.
జపాన్‌కు చెందిన లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (ఎల్‌డీపీ) నాయకుడు షిగేరు ఇషిబా జపాన్ డైట్‌లోని ఉభయ సభల్లో అత్యధిక ఓట్లు సాధించి దేశ ప్రధానమంత్రిగా తిరిగి సోమవారం ఎన్నికయ్యారు.
ప్రధాని మోడీ మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం ముగించుకుని ఢిల్లీకి చేరుకున్నారు. అనంతరం రాజకీయ కురువృద్ధుడు, బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే.అద్వానీ ఇంటికి వెళ్లారు. అద్వానీ శుక్రవారం (నవంబర్ 8) 97వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అద్వానీకి ప్రధాని మోడీ బర్త్‌డే విషెస్ చెప్పారు.
CM Revanth Reddy: ప్రధాని మోడీ కి సీఎం రేవంత్ ట్వీట్ సంచలనంగా మారింది. మా ప్రభుత్వం గురించి మీరు చేసిన ప్రకటనలలో అనేక అపోహలు.. అవాస్తవాలు ఉన్నాయని ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖర్‌ను ప్రధాని నరేంద్ర మోడీ కలిశారు. ఢిల్లీలోని ధన్కర్ నివాసానికి వెళ్లి కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి దంపతులకు ప్రధాని మోడీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
PM Modi Vadodara Visit: వడోదరలో ప్రధాని నరేంద్ర మోడీ, స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ రోడ్ షో నిర్వహించారు. ఈ రోజు వడోదరలో సీ295 ఎయిర్‌క్రాఫ్ట్ ఫైనల్ అసెంబ్లీ లైన్ ప్లాంట్‌ను ఇరువురు నేతలు ప్రారంభించారు. వడోదరలో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (TASL) క్యాంపస్‌లో టాటా ఎయిర్‌క్రాఫ్ట్ కాంప్లెక్స్‌ను స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్‌తో కలిసి ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. దీనితో పాటు, అమ్రేలిలో రూ. 4900 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టును…
పెరుగుతున్న 'డిజిటల్ అరెస్ట్' కేసులపై ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని నివారించడానికి.. ' ఆలోచించండి, చర్య తీసుకోండి' అనే మంత్రాన్ని దేశప్రజలతో పంచుకున్నారు.