దేశ ప్రధానిగా మోడీ (74) సరికొత్త రికార్డ్ సృష్టించారు. దేశ చరిత్రలో అత్యధిక రోజులు ప్రధానమంత్రిగా పని చేసిన రికార్డ్‌ను మోడీ సొంతం చేసుకున్నారు. శుక్రవారంతో 4,078 రోజులు పదవీకాలం పూర్తి చేసుకున్నారు. 4,077 రోజులు ప్రధానమంత్రిగా పనిచేసిన మాజీ ప్రధానమంత్రి, దివంగత ఇందిరా గాంధీ రికార్డును మోడీ అధిగమించారు. వరుసగా ఇన్ని రోజులు ఏకధాటిగా పని చేసిన కాంగ్రెసేతర ప్రధానుల్లో మోడీనే ఆ రికార్డ్ సొంతం చేసుకున్నారు. జూలై 25, 2025న మోడీ వరుసగా 4,078 రోజుల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు.
ఇది కూడా చదవండి: Kareena : యువ నటుడి ప్రేమలో కరీనా?
1966 జనవరి 24 నుంచి 1977 మార్చి 24 వరకు వరుసగా 4,077 రోజులుగా ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ పాలించారు. ఇప్పటి వరకు ఆ రికార్డ్‌ను ఎవరు అధిగమించలేదు. తొలిసారి కాంగ్రెసేతర నేత ఆ రికార్డ్‌ను అధిగమించారు. అది కేవలం మోడీకి మాత్రమే సొంతం అయింది. రెండు సార్లు పూర్తి మెజార్టీతో మోడీ అధికారాన్ని సొంతం చేసుకున్నారు. గతేడాదిలో జరిగిన ఎన్నికల్లో మిత్ర పక్షాల మద్దతుతో మూడోసారి ప్రధాని పదవిని చేపట్టారు. 1971లో ఇందిరాగాంధీ తర్వాత పూర్తి మెజార్టీతో తిరిగి అధికారంలోకి వచ్చిన మొదటి సిట్టింగ్ ప్రధాని మోడీనే కావడం విశేషం.
ఇది కూడా చదవండి: Crime News: ప్రియుడి ఇంటిముందు మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం.. సగం కాలిన దేహంతో..!
ఇంకొక విశేషమేంటంటే.. ముఖ్యమంత్రిగా.. ప్రధానిగా వరుసగా ఆరుసార్లు ఎన్నికల్లో గెలిచిన నాయకుడు కూడా మోడీనే కావడం గొప్ప విశేషం. గుజరాత్ ముఖ్యమంత్రిగా (2002, 2007, 2012) మూడు సార్లు పనిచేశారు. ఇక లోక్‌సభ ఎన్నికలు వరుసగా గెలిచి (2014, 2019, 2024) ప్రధాని బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో, కేంద్రంలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన నేతగా మోడీ దాదాపు 24 సంవత్సరాల నుంచి పాలనలో కొనసాగడం ఇదొక మైలురాయి అవుతుంది. తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ఈ రికార్డును కలిగి ఉన్నారు. వరుసగా మూడు లోక్‌సభ ఎన్నికల్లో పార్టీని విజయపథంలో నడిపించడంలో నెహ్రూ తర్వాత ప్రధాని మోడీ సమానంగా ఉన్నారు. జవహర్‌లాల్ నెహ్రూ ఆగస్టు 15, 1947 నుంచి మే 27 వరకు 16 సంవత్సరాలు దేశాన్ని పాలించారు.
మోడీ.. గుజరాత్‌లోని వాద్‌నగర్‌లో ఒక నిరాడంబరమైన కుటుంబంలో జన్మించారు. అనంతరం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS), భారతీయ జనతా పార్టీ (BJP)లో అంచెలంచెలుగా ఆయా హోదాల్లో ఎదిగారు. రైల్వే స్టేషన్‌లో తన తండ్రికి సాయంగా టీ అమ్మడానికి మోడీ సహకరించారు. 2014లో బీజేపీని చారిత్రాత్మక విజయంలోకి నడిపించారు. దశాబ్ద కాలం పాటు గుజరాత్ ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆనాటి నుంచి ప్రపంచ నాయకుడిగా గుర్తింపు పొందారు.
దేశ ప్రధానిగా తొలిసారి మే 26, 2014లో మోడీ ప్రమాణస్వీకారం చేశారు. ఆనాటి నుంచి వరుసగా ప్రధాని పదవిలో కొనసాగుతున్నారు. అంతేకాకుండా అంతర్జాతీయంగా కూడా మంచి పేరు సంపాదించారు. ఇందుకు ప్రపంచ నాయకులతో మంచి సత్సంబంధాలు కలిగి ఉండడమే కారణం. 2014లో బీజేపీ 272 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చింది. ఇక 2019లో 303 స్థానాలు గెలుచుకుని తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంది. ఇక 2024లో మాత్రం మిత్ర పక్షాల మద్దతుతో మోడీ ప్రధాని అయ్యారు.