https://youtu.be/OhCCLSb_rV8 అవును.. శ్రీలంకలో అదే జరుగుతోంది. ఆనాడు రామాయణంలో హనుమంతుడు లంకను తగులబెట్టాడని అంటారు. చూసి రమ్మంటే కాల్చివచ్చాడంటారు. కానీ ఇప్పుడు లంకలో ఆ దేశ ప్రజలే హింసకు పాల్పడుతున్నారు. అధ్యక్షుడు, ప్రధాని, మంత్రులు.. ఎవరి ఇళ్ళను వదిలిపెట్టడం లేదు. ఎంపీలు, మాజీ మంత్రుల ఇళ్లకు ఆందోళనకారులు సాయంత్రం నిప్పు పెట్టారు. సోమవారం నాడు మధ్యాహ్నం ప్రధాని రాజపక్సే తన పదవికి రాజీనామా చేశారు. రాజపక్సే రాజీనామా చేసిన తర్వాత కూడా ఆందోళనలు సద్దుమణగలేదు. కొలంబోలో శాంతియుతంగా…
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉత్తర ప్రదేశ్‌పై ప్రధాని మోదీ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో మంగళవారం నాడు యూపీలోని ప్రయాగ్ రాజ్‌లో ప్రధాని మోదీ పర్యటించారు. ఈ సందర్భంగా స్వయం సహాయక మహిళా సంఘాల ఖాతాలకు రూ.వెయ్యి కోట్లను ప్రధాని మోదీ బదిలీ చేశారు. ప్రయాగ్ రాజ్ పవిత్ర గంగా, యుమన, సరస్వతి నదుల సంగమ స్థలి అని మోదీ ప్రస్తుతించారు. వేలాది సంవత్సరాల మన మాతృ శక్తికి ప్రతీకగా దానిని…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తన స్వరం మార్చారు. ఇటీవల రాహుల్ ప్రధాని కాలేరని వ్యాఖ్యానించిన ప్రశాంత్ కిషోర్… తాజాగా తన మాట మార్చుకుని రాహుల్ ప్రధాని అయ్యే అవకాశాలున్నాయని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ లేకుండా ప్రతిపక్ష పార్టీలు కేంద్రంలో అధికారం చేపట్టడం కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. గాంధీ పరివారం లేకపోయినా కాంగ్రెస్ పార్టీ మనుగడ సాధించగలదని ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు. ఓ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రశాంత్ కిషోర్ చేసిన తాజా వ్యాఖ్యలు…
బీజేపీ సర్కారు వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చాక సంస్కరణ పేరిట మరింత దూకుడు పెంచింది. మోదీ సర్కారు అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే ఎన్నో సంచలనాలకు నాంది పలికింది. జనధన్ ఖాతాలు, పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు వంటి కీలక నిర్ణయాలను తీసుకుంది. ఇక రెండోసారి పొత్తుల ఎత్తులతో సంబంధం లేకుండానే బీజేపీకే అత్యధిక సీట్లు వచ్చాయి. దీంతో మోదీ సర్కారు తగ్గెదేలా అన్నట్లుగా వ్యవహరిస్తోంది. పార్లమెంటులో కీలక బిల్లులను ఆమోదింపజేసుకుంటోంది. అయితే మోదీ సర్కారు దూకుడు…