Adhir Ranjan Chowdhury: ద్రవ్యోల్బణం, ఈడీ కేసులు, నిరుద్యోగం, జీఎస్టీ తదితర అంశాలపై కాంగ్రెస్ పోరాడుతోంది. అధికార పార్టీ బీజేపీని ఎండగట్టే ప్రయత్నం చేస్తోంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా దుమారాన్ని రేపాయి. అధీర్ రంజన్ చౌదరి చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఉద్దేశిస్తూ..‘‘ రాష్ట్రపత్ని’’ అని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీని బీజేపీ తీవ్రస్థాయిలో విమర్శిస్తోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును అవమానించిన కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాల్సిందే అని డిమాండ్ చేస్తోంది.
ఈ నేపథ్యంలో తాజా వివాదంపై కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి స్పందించారు. తాను క్షమాపణ చెబుతానని.. తనను ఉరితీసినా తాను సిద్ధంగా ఉన్నానన్న ఆయన.. ఈ వివాదంలోకి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఎందుకు లాగుతున్నారని ప్రశ్నించారు. తాను పొరపాటుగా ఈ వ్యాఖ్యలు చేశానని.. రాష్ట్రపతిని కించపరిచే ఉద్దేశం తనకు లేదన్నారు.
Parliament Monsoon Session: రాజ్యసభలో మరో ముగ్గురు ఎంపీలపై సస్పెన్షన్ వేటు
ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ముపై అధిర్ రంజన్ చేసిన వ్యాఖ్య తీవ్ర వివాదానికి తెరలేపిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును అధిర్ రంజన్ రాష్ట్రపత్నిగా సంభోదించారు. అధిర్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీలు పార్లమెంట్‌లో నిరసనలకు దిగారు. అయితే దీనిపై పార్లమెంట్ నేడు దద్దరిల్లింది. అధిర్ రంజన్ వ్యాఖ్యలకు గాను క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, నిర్మలా సీతారామన్ సహా బీజేపీ నేతలు కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ట్విట్టర్ వేదికగా అధిర్ రంజన్ చౌదరివీడియోను విడుదల చేశారు. “దేశ ప్రథమ పౌరురాలిని అవమానించే ఉద్దేశం నాకు లేదు. అది పొరపాటుగా జరిగింది. పూర్తిగా నా తప్పే. ఒకవేళ రాష్ట్రపతి అవమానకరంగా భావిస్తే నేరుగా వెళ్లి క్షమాపణలు చెబుతాను. నేను చేసిన పొరబాటుకు కావాలంటే నన్ను ఉరితీయండి. శిక్షను ఎదుర్కోడానికి నేను సిద్ధమే. అంతేగానీ, ఈ వివాదంలోకి మేడమ్(సోనియా గాంధీ)ని ఎందుకు లాగుతున్నారు?’’ అని ఆయన ప్రశ్నించారు.
— Adhir Chowdhury (@adhirrcinc) July 28, 2022