ఉత్తరాంధ్రలో 35 సీట్లు గెలిపించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓటర్లను కోరారు. రాజాంలో జరిగిన ప్రజాగళం సభలో ఆయన మాట్లాడారు. రాజాం సముద్రాన్ని మించిన జనసంద్రం ఇదని.. ఈ కార్యక్రమానికి జనాలు కమిట్ మెంట్ తో వచ్చారన్నారు. తాగునీటి కోసం ఉత్తరాంధ్రా సుజల స్రవంతి కోసం పోలవరం, వంశదార అనుసంధానం వల్ల తాగు, సాగు నీరు వస్తుందని తెలిపారు. దీనికి 2 వేల కోట్లు ఖర్చు పెట్టామని.. వైసీపీ 5 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు.
మనందరి బతుకులు మార్చుకునేందుకు కీలకమైన సమయానికి వచ్చామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ప్రజాగళం సభలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్ల జలగ పాలనలో మనకేమైన మిగిలిందా.? మన జీవితాలు బుగ్గి అయిపోయాయన్నారు. అన్ని వర్గాలు సంక్షోభంలో పడ్డాయి.. ఖర్చులు పెరిగి ఆదాయం తగ్గిందన్నారు.
రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ప్రజాగళంకు భారీ స్పందన వస్తోందని.. వచ్చే 39రోజుల్లో జోరు పెరగాలి, ఫ్యాన్ తుక్కు తుక్కు కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల ప్రజాగళం సభలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో దొంగలు పడ్డారు.. బందిపోట్లు పడ్డారు.. వారందరికీ నాయకుడు జగన్ అంటూ విమర్శించారు.
మార్కాపురం మారుమోగిపోయిందని.. మార్కాపురంలో వచ్చిన స్పందన తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. జనం నాడి తెలిసిపోయిందని.. వైసీపీ చిత్తుచిత్తుగా ఓడిపోతుందన్నారు.
జగన్ ఇంటికి వెళ్లే రోజు దగ్గరకు వచ్చిందని, ప్రజలు కసితో ఎదురుచూస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. సామాజిక న్యాయం చేసేది టీడీపీనేనని ఆయన వ్యాఖ్యానించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రజాగళం సభలో ఆయన ప్రసంగించారు.
ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. అన్ని పార్టీల నేతలు తమ ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం పేరుతో ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. తిరుపతి జిల్లా నాయుడుపేట ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రసంగించారు.సూళ్లూరుపేటలో టీడీపీ గాలి వీస్తోందన్న ఆయన.. జగన్‌కు ఓటు వేసినందుకు ఆయన ప్రజలను మోసగించారని విమర్శించారు.
వచ్చే ఎన్నికల్లో వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఎన్డీఏ అన్ స్థాపబుల్ అని.. ఎక్కడ చూసినా ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోందన్నారు. నెల్లూరు జిల్లా కావలిలో నిర్వహించిన ‘ప్రజాగళం’ సభలో చంద్రబాబు ప్రసంగించారు.
నగరిలో మీ ఉత్సాహం చూస్తూ ఉంటే రాష్ట్రానికి మంచి రోజులు వస్తున్నాయని అనిపిస్తోందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలోని పుత్తూరులో ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రసంగించారు. ఈ సభలో గాలి భానుప్రకాష్, ఇతర నేతలు పాల్గొన్నారు. నగరి మీటింగ్ చూసిన తర్వాత జగన్ మైండ్ బ్లాక్ అవుతుందన్నారు.