Chandrababu: నాలుగు లక్షల కోట్ల ప్రజాధనాన్ని విధ్వంసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు. బాపట్ల ప్రజాగలం బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. తన బాధంతా ప్రజల ఆస్తి లూటీ అవుతుందని.. సంపదను నాశనం చేసి మీ నెత్తిన 13 లక్షల కోట్ల అప్పులు పెట్టాడని ఆరోపించారు. ఈ అప్పులన్నీ ఎవరు కడతారని ప్రశ్నించారు. పన్నుల రూపంలో ప్రజలే కట్టాలి అడిగితే సమాధానం చెప్పే వాళ్ళు లేరు అదే తన బాధ అని పేర్కొన్నారు. పోలవరం ఈ రాష్ట్రానికి రెండో కన్ను పోలవరం పూర్తి అయితే గోదావరి కృష్ణ నదుల అనుసంధానం జరిగేదన్నారు. నాగార్జునసాగర్ ద్వారా రాయలసీమకు నీళ్లు తీసుకెళ్లి నదుల అనుసంధానం ద్వారా ప్రతి ఎకరానికి నీళ్లు అందించే వాళ్ళమన్నారు. టెండర్లు మార్చి రివర్స్ టెండరింగ్ అన్నాడు.. రివర్స్ టెండర్రింగ్‌తో గోదావరిలో పోలవరాన్ని ముంచేశాడన్నారు.
Read Also: Janasena: జనసేన రాష్ట్ర ఎన్నికల పర్యవేక్షణ కమిటీ నియామకం
ఈ ముఖ్యమంత్రి విచిత్రమైన వ్యక్తి అని.. ఎంతో మంది ముఖ్యమంత్రులని చూశాను కానీ ఇలాంటి విచిత్రమైన ముఖ్యమంత్రి అని తాను చూడలేదన్నారు. నా బీసీలు అంటూనే 30 రకాల పథకాలు రద్దు చేశాడన్నారు. నా ఎస్సీలని 27 పథకాలు రద్దు చేశారన్నారు. నా ఎస్సీలు అని చెప్పే ముఖ్యమంత్రి, ఓ ఎస్సీని చంపి డోర్ డెలివరీ చేస్తే ఏం చేశాడన్నారు. అంబేడ్కర్ పేరుతో విదేశీ విద్యా పథకాన్ని పెడితే , ఆ పేరు మార్చేసి జగన్ అన్న విద్యా పథకం అని పెట్టుకున్నాడన్నారు. బీసీలు, ఎస్సీలు ఈ విధానాన్ని సపోర్ట్ చేస్తారా అంటూ ప్రశ్నించారు. విద్యుత్ చార్జీలు పెరిగిపోయాయి, దీనికి కారణం ఎవరని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇసుక దందా ఎవరిది జగన్మోహన్ రెడ్డి కాదా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ విచ్చలవిడిగా లభ్యమవుతున్నాయన్నారు. బాపట్ల లాంటి ప్రాంతంలో కూడా దుకాణాల్లో గంజాయి అమ్ముతున్నారన్నారు. ఆ గంజాయి అమ్మకాల్లో ఎమ్మెల్యేలకు వాటాలు ఉన్నాయని ఆరోపించారు.
చంద్రబాబు మాట్లాడుతూ.. “బాపట్ల నాకు బ్రహ్మరధం పట్టింది. మూడు పార్టీల కలయిక విజయానికి అన్ స్టాపబుల్.ప్రజలు విజ్ఞతతో ఎన్నికలలో ఓటు వేయాలి. జగన్ అహంకారం విధ్వంసంతో రాష్ట్రాన్ని విధ్వంసం చేశాడు. ఈ ప్రాంతా దాహార్తిని తీర్చడానికే పట్టిసీమ నిర్మించాను. పవన్ మొదటి నుంచి ప్రభుత్వం ఓటు చీలనివ్వనని చెప్పారు. మా పొత్తుతో జగన్‌కు నిద్రపట్టడం లేదు. కేంద్రంలో ముస్లీంలకు వ్యతిరేక బిల్లులకు జగన్ మద్దతు తెలిపాడు. ఉర్దూ రెండవ భాషగా 13 జిల్లాలో ప్రకటించింది నేనే. కులాలకు అతీతంగా తెలుగు వారు రాష్ట్ర అభివృద్ధి కోసం ఏకంకావాలి. గడితప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెడతాను. నేను విమర్శకులకే పరిమితం కాను. రాష్ట్రాభివృద్దికి కోసం సంపద సృష్టిస్తాను. పేదలు అన్ని కులాలలో ఉన్నారు. పిల్లలే రాష్ట్రానికి ఆస్తి.” అని చంద్రబాబు పేర్కొన్నారు.