పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ప్రశాంత్ నీల్ చేస్తోన్న ‘సలార్’పై ఎన్ని అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఒకరేమో బాహుబలి, మరొకరేమో కేజీఎఫ్‌తో సంచలనాలు సృష్టించిన డైరెక్టర్. ఈ క్రేజీ కాంబోలో ‘సలార్’ వస్తుండడంతో.. జాతీయంగా విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఇప్పుడా అంచనాలు తారాస్థాయిలో పెంచే మరో క్రేజీ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం.. సలార్‌తో హీరో యశ్ ఓ అతిథి పాత్రలో మెరువనున్నాడట! కేజీఎఫ్‌తో యశ్‌కి పాన్ ఇండియా క్రేజ్…
ప్రభాస్ హీరోగా పలు సినిమాలు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నటిస్తున్న ‘ప్రాజెక్ట్ కె’ సినిమా అందులో ఒకటి. ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో పూర్తి చేసుకుంది. అమితాబ్ తో పాటు దీపిక పడుకొనె కూడా షూటింగ్ లో పాల్గొన్నారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి కొత్త కార్యాలయాన్ని గచ్చిబౌలిలో ఆరంభించారు. ఈ వేడుకలో ప్రభాస్ తో పాటు అమితాబ్ బచ్చన్, రాఘవేంద్రరావు, నాగ్ అశ్విన్, ప్రశాంత్ నీల్, నాని,…
ఎమ్మెస్ రాజు.. ఒకప్పుడు బ్లాక్ బస్టర్ సినిమాల నిర్మాత. ‘ఒక్కడు’, ‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ లాంటి సూపర్ హిట్ సినిమాల్ని ఆయన నిర్మించారు. అలాంటి ఆయన ఆ తర్వాతి కాలంలో నష్టాల్లో కూరుకుపోయారు. పెద్ద హీరోలతో తిరిగి సినిమాల్ని నిర్మించలేని దుస్థితికి చేరుకున్నారు. చివరగా.. ఈయన నిర్మించింది ‘మస్కా’. ఇప్పుడు దర్శకుడిగా సినిమాలు చేస్తూ వస్తున్నారు కానీ, నిర్మాతగా తన ప్రస్థానాన్ని ఆపేశారు. అసలెందుకు ఎమ్మెస్ రాజుకి ఈ పరిస్థితి వచ్చింది? నిర్మాతగా ఎందుకు తన జర్నీని…
ప్రస్తుతం భారత చిత్రసీమలో రూపొందుతోన్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ‘సలార్’ ఒకటి. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్, ‘బాహుబలి’ ప్రభాస్ కాంబోలో ఈ సినిమా తెరకెక్కుతుండడంతో.. నేషనల్ లెవెల్లో ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. అందుకు తగినట్టుగానే దర్శకుడు ఈ చిత్రాన్ని గ్రాండ్ గా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. కీలక పాత్రల కోసం ఏరికోరి మరీ క్రేజీ నటీనటుల్ని ఎంపిక చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ను ఓ ప్రధాన పాత్ర కోసం…
సాధారణంగా ఒకట్రెండు హిట్లు పడగానే హీరోలు తమ పారితోషికాన్ని పెంచేస్తుంటారు. గత సినిమాలు రాబట్టిన కలెక్షన్లు, దాని వల్ల తమకు పెరిగిన మార్కెట్ & క్రేజ్ ని బట్టి.. హీరోలు కొంత అమౌంట్ పెంచుతారు. నిర్మాతలు సైతం ఆయా హీరోలకున్న క్రేజ్ ని చూసి.. అడిగినంత డబ్బులు ఇవ్వడానికి రెడీ అయిపోతారు. ఇప్పుడున్న స్టార్ హీరోల్లో అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకున్నదెవరైనా ఉన్నారంటే.. అది రెబెల్ స్టార్ ప్రభాస్. బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియా స్టార్ గా…
తమ కెరీర్ లో కనీసం ఒక్కసారైన దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో పని చేయాలని నటీనటులు కోరుకుంటారు. స్టార్ నటులు కూడా ఇందుకు మినహాయింపు కాదు. జక్కన్న ఓకే అంటే, కుండపోతగా తమ డేట్స్ ఇచ్చేందుకు ఎందరో సిద్ధంగా ఉన్నారు. అలాంటిది.. స్వయంగా జక్కన్నే తన వద్దకు వచ్చి ‘బాహుబలి’లాంటి ఆఫర్ చేస్తే, రిజెక్ట్ చేశాడో నటుడు. ఇంతకీ, అతనెవరని అనుకుంటున్నారా? కరోనా లాక్డౌన్ సమయంలో ఎందరో పేదవాళ్లకు సహాయం చేసి రియల్ హీరోగా అవతరించిన సోనూ…
ఓవైపు హీరోలందరూ ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే గగనమౌతుంటే.. నేచురల్ స్టార్ నాని మాత్రం కనీసం మూడు సినిమాల్ని రిలీజ్ చేస్తున్నాడు. ‘ఎవడే సుబ్రమణ్యం’ నుంచి సుడి తిరగడంతో, వెనక్కి తిరిగి చూసుకోకుండా వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈ నేచురల్ స్టార్.. లేటెస్ట్గా మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. ఇన్సైడ్ న్యూస్ ప్రకారం.. మారుతి దర్శకత్వంలో ఓ చిత్రం చేసేందుకు నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట!…
కొన్ని రోజుల క్రితం బాలీవుడ్ నటి దీపికా పదుకొణె ఆసుపత్రిలో చేరిన వార్త ఎంత హల్చల్ సృష్టించిందో అందరికీ తెలుసు! ఆ వెంటనే డిశ్చార్జ్ అయ్యింది కానీ, ఆమె ఆరోగ్యంపై పూర్తి స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రాజెక్ట్ కే నిర్మాత అశ్వినీ దత్ ఆమె ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చారు. దీపికాకి బీపీ ఇష్యూస్ ఉన్నాయని, అందుకే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యిందన్నారు. అయితే.. గంటలోపే ఆమె డిశ్చార్జ్ అయ్యిందని, తిరిగి షూటింగ్లో పాల్గొందని వెల్లడించారు. అంతేకాదు..…
‘ఆచార్య’తో డీలా పడ్డ మెగాస్టార్ చిరంజీవి చేతిలో ప్రస్తుతం వరుస సినిమాలు ఉన్నాయి. అవి కాకుండా కొత్తదనం ఉన్న స్క్రిప్ట్లకోసం కూడా తాపత్రయపడుతున్నాడు. ఇదిలా ఉంటే ఇటీవల చిరంజీవి ‘విక్రమ్’ సినిమా చూసి కమల్ హాసన్ తో పాటు దర్శకుడు లోకేష్ కనగరాజ్‌ని ఆహ్వానించి అభినందించారు. అంతే కాదు అదే మీట్ లో ప్రభాస్‌కు లోకేష్ కనకరాజ్ చెప్పిన కథ గురించి కూడా అడిగి తెలుసుకున్నాడట. అయితే ఆ స్క్రిప్ట్ ను ప్రభాస్ నిరాకరించిన విషయం తెలిసినదే.…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా కొనసాగుతున్న విషయం విదితమే.. వరుస సినిమాలను లైన్లో పెట్టి బిజీగా ఉన్న ప్రభాస్ ప్రస్తుతం సలార్ మూవీ ని పూర్తిచేసే పనిలో పడ్డాడు.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. అయితే గత కొన్ని రోజులుగా ప్రభాస్ లుక్స్ పై ట్రోలింగ్ విపరీతంగా జరిగిన విషయం తెలిసిందే.. ప్రభాస్ లుక్ అస్సలు బాగోలేదని, అతడు ఆరోగ్యం మీద,…