Prabhas: నేడు మొగల్తూరు లో జాతర వాతవరణం నెలకొంది. సెప్టెంబర్ 11 న రెబల్ స్టార్ కృష్ణంరాజు అనారోగ్య సమస్యలతో మృతి చెందిన విషయం విదితమే. నేడు ఆయన స్వస్థలమైన మొగల్తూరులో సంస్కరణ సభను కుటుంబ సభ్యులు నిర్వహించారు. దాదాపు 12 ఏళ్ల తరువాత ప్రభాస్ మొగల్తూరులో అడుగుపెట్టాడు. దీంతో ప్రభాస్ అభిమానులు మొగల్తూరుకు పోటెత్తారు. ఇక ఈ సంస్కరణ సభకు వచ్చినవారందరికి ప్రభాస్ భోజన ఏర్పాట్లు చేయించారు. వంద కాదు వెయ్యి కాదు లక్ష మందికి భోజనాలను సిద్ధం చేశారు. అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం ఈ సభకు హాజరు కానున్నారు.
ఇక లక్షమందికి భోజనాలు అంటే మాటలు కాదు. అందులోనూ ఒకటి రెండు ఐటమ్స్ కాదట.. దాదాపు 30, 40 రకాల వంటకాలను వడ్డించనున్నారట. అందులో ప్రధానంగా తయారుచేయించినవి.. 6 టన్నుల మటన్ కర్రీ, 6 టన్నుల బిర్యానీ మటన్, 1 టన్ను రొయ్యల గోంగూర ఇగురు, 1 టన్ను రొయ్యల ఇగురు, 1 టన్ను స్టప్డ్ క్రాబ్, 1 టన్ను బొమ్మిడాయల పులుసు, 6 టన్నుల చికెన్ కర్రీ, 4 టన్నుల చికెన్ ఫ్రై, 6 టన్నుల చికెన్ బిర్యానీ, 1 టన్ను పండుగప్ప కర్రీ, 4 టన్నుల చందువా ఫిష్ ఫ్రై, 2 టన్నుల చిట్టి చేపల పులుసు, ఇవి కాక మొత్తం 22 రకాల నాన్ వెజ్ వంటకాలు. 2 లక్షల బూరెలు, ఇంకా వెజ్ వంటకాలు ,మజ్జిగ చారు, స్వీట్స్, అప్పడాలు ఉన్నాయి. ఇక ఈ లిస్ట్ చూసాకా అభిమానులు అందరు ఒకటే మాట అంటున్నారు.. రాజుగారి విందు.. ప్రభాస్ రాజు వలనే అవుతుందని కామెంట్స్ పెట్టుకొస్తున్నారు. ఇక ప్రభాస్ వచ్చినవారందరిని తిని వెళ్ళమని చెప్పడం విశేషం.