Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పెదనాన్న పోయిన బాధలో ఉన్న విషయం విదితమే. సెప్టెంబర్ 11 న రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూశారు. ఈ నెల 29 న మొగల్తూరు లో ఆయన సంస్కరణ సభ జరగనుంది. అయితే పెదనాన్న చనిపోయిన దగ్గరనుంచి పెద్దమ్మను, చెల్లెళ్లను కంటికి రెప్పలా చూసుకుంటున్న ప్రభాస్ వారికి తోడుగా షూటింగ్లు మానేసి మరీ ఇంట్లోనే ఉంటున్నాడు. అయితే మొగల్తూరు లో సంస్కరణ అనంతరం ప్రభాస్ సలార్ సెట్ లో ప్రత్యేక్షం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. విషయం ఏంటంటే.. కృష్ణంరాజు మృతిని ప్రభాస్ తట్టుకోలేకపోతున్నాడని, కనీసం సెట్ లోఉంటే వర్క్ పై శ్రద్ద పెట్టడం వలన అయినా కొద్దిగా కోలుకుంటాడని సన్నహితులు చెప్పడంతో సలార్ షూటింగ్ ను మళ్లీ మొదలుపెట్టనున్నారట మేకర్స్.
ఇప్పటికే రామోజీ ఫిల్మ్ సిటీలో సలార్ కు సంబంధించిన సెట్ ను వేస్తున్నారని సమాచారం. అయితే సంస్కరణ సభ ముందే ప్రభాస్ షూటింగ్ లో పాల్గొంటాడా..? మొగల్తూరు నుంచి వచ్చాకా సెట్ లో అడుగుపెడతాడా..? అనేది తెలియాల్సి ఉంది. ఇక సలార్ విషయానికొస్తే.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ నటిస్తోంది. ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తి అయ్యిందని, 40 శాతం షూటింగ్ ను త్వరగా ఫినిష్ చేయాలనీ చూస్తున్నారట మేకర్స్.. ఇక ఈ సినిమా తరువాత ప్రభాస్ లైనప్ చాలా పెద్దదిగానే ఉండడంతో ఎంత త్వరగా షూటింగ్ ఫినిష్ చేస్తే అంత త్వరగా రిలీజ్ డేట్స్ ఇవ్వొచ్చని చూస్తున్నారట.. మరి ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.