పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు విజయవాడలో తెలంగాణ సీఎం కేసీఆర్, పవన్ కల్యాణ్‌ల భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. భీమ్లానాయక్ సినిమా విడుదల సందర్భంగా తెలంగాణలో టిక్కెట్ ధరలు పెంచడం, ఐదో షోకు అనుమతులు ఇవ్వడాన్ని స్వాగతిస్తూ పవన్ అభిమానులు కేసీఆర్ మీద తమ అభిమానాన్ని చాటుకున్నారు. దీంతో హ్యాట్సాఫ్ సీఎం అంటూ విజయవాడ కృష్ణలంకలోని ఫైర్ స్టేషన్ సమీపంలో భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అయితే విజయవాడలోని కృష్ణలంకలో ఏర్పాటు చేసిన సీఎం…
పవర్‌స్టార్ అభిమానులలో ఈరోజు పండగ వాతావరణం నెలకొంది. ఎందుకంటే పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ ఈరోజే భారీ ఎత్తున థియేటర్లలో విడుదలైంది. తొలి షో నుంచి సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడంతో థియేటర్లు దద్దరిల్లుతున్నాయి. దీంతో పవర్‌స్టార్ అభిమానుల హంగామా మాములుగా లేదు. ఇప్పటికే సోషల్ మీడియాలో సినిమా టాక్ గురించి తెగ చర్చ నడుస్తోంది. హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల వద్ద బ్యానర్లు, డప్పులు, దండలు.. ఇలా పవన్ అభిమానుల…
జానర్: యాక్షన్ డ్రామానటవర్గం: పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి, నిత్యామీనన్, సంయుక్త మీనన్, సముద్రఖని, రావు రమేశ్, బ్రహ్మానందం, మురళీ శర్మ, రఘుబాబు, తనికెళ్ల భరణి, కాదంబరి కిరణ్దర్శకత్వం: సాగర్ కె.చంద్రనిర్మాత: సూర్యదేవర నాగవంశీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25న జనం ముందుకు వచ్చింది. పవన్ కళ్యాణ్ గత చిత్రం వకీల్ సాబ్ అభిమానులను ఆకట్టుకున్నా, అందులో వారికి కావాల్సిన కిక్ లేదనే చెప్పాలి.…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్‌లో జరిగిన విషయం తెలిసిందే. అయితే పవన్ అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమ అభిమాన హీరోకు సంబంధించి ఏ ఈవెంట్‌ను మిస్ చేసుకోరు. అందులో పవన్ కల్యాణ్ అంటే యువతో పాటు అన్ని వయసుల వాళ్లు ఆసక్తి చూపుతుంటారు. అయితే ఎంతో నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ప్రీ రిలీజ్ వేడుక…
సినిమా లేకపోతే ఈరోజు ప్రజల్లో తన ఉనికి ఉండేది కాదని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ.. నిజమైన కళాకారుడికి కులం, మతం, ప్రాంతం అనేది పట్టదని అన్నారు. ఎక్కడో చెన్నైలో ఉండే చిత్రపరిశ్రమను హైదరాబాద్‌కు తీసుకురావడంతో ఎందరో సినీ పెద్దలతో పాటు చెన్నారెడ్డి లాంటి మహనీయులు తోడ్పాటు అందించారని.. అలాంటి సినిమా ఇండస్ట్రీకి కేసీఆర్ లాంటి వాళ్లు సహకారం అందించడం ఎంతో సంతోషంగా ఉందని పవన్…
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అభిమానులకు పండగ వాతావరణం తెచ్చింది. ఈ ఫంక్షన్ సందర్భంగా రానా ఉద్వేగంగా మాట్లాడారు. మీ సార్ పెద్ద గబ్బర్ సింగ్ అంట కదా.. నేనెవరో తెలుసా అన్నారు. ఈ సినిమాతో ఎంతోమంది మేధావుల్ని కలిశాను. చిన్నప్పుడు హీరో కావాలని అనుకున్నాను. హీరో ఎలా అవ్వాలో తెలీదు. ఇండియాలో పెద్ద సూపర్ స్టార్స్ తో చేశాను. పవన్ డిఫరెంట్. ఇప్పటివరకూ చేసిన సినిమాలు ఒకలా…
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా మంత్రులు కేటీఆర్, తలసాని హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. నాలుగేళ్ల క్రితం యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో చిరంజీవి, రామ్‌చరణ్ పిలిచిన ఓ సినిమా ఫంక్షన్‌కు హాజరయ్యానని.. అప్పుడు మెగాస్టార్, ఆయన సోదరుడు పవర్‌స్టార్ అని మాట్లాడుతుంటే.. తనను అభిమానులు అరుపులతో మాట్లాడనివ్వలేదని.. ఇప్పుడు కూడా తనని మాట్లాడనివ్వడం లేదని కేటీఆర్ నవ్వుతూ అన్నారు. 26 ఏళ్లుగా ఒకే విధమైన స్టార్‌డమ్‌ను…
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరుగుతోంది. ఈ వేడుకలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్, డ్రమ్స్ స్పెషలిస్ట్ శివమణి భీమ్లా నాయక్ మూవీలో పాటలకు పర్ఫార్మ్ చేస్తూ డ్రమ్స్ వాయించారు. వీరిద్దరూ కలిసి డ్రమ్స్ వాయిస్తూ ఉండగా శివమణి వెళ్లి హీరో పవన్ కళ్యాణ్‌ను, మంత్రి కేటీఆర్‌ను స్టేజీ మీదకు తీసుకొచ్చి వారితో డ్రమ్స్ వాయించేలా చేశారు. పవన్ కళ్యాణ్, కేటీఆర్ ఇద్దరూ కూడా డప్పు వాయించారు. దీంతో…
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా మంత్రులు కేటీఆర్, తలసాని హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. పవన్ కళ్యాణ్ 24 ఏళ్ల క్రితం ఇండస్ట్రీలోకి హీరోగా వచ్చినప్పటి నుంచి రోజురోజుకు ఆయన క్రేజ్ పెరుగుతూనే ఉందని తలసాని వ్యాఖ్యానించారు. పవన్ వయసు పెరుగుతుందా లేదా తగ్గుతుందో తెలియకుండా ఉందని తలసాని అన్నారు. మూవీ ఇండస్ట్రీ బాగుండాలన్నదే తమ ప్రభుత్వం ముఖ్య…
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అభిమానులకు పండగ వాతావరణం తెచ్చింది. ఈ ప్రి రిలీజ్ వేడుక కోసం వేయికళ్ళతో ఎదురుచూసిన పవర్ స్టార్ ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చేశాయి. మంత్రి కేటీఆర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కేటీఆర్ తో పాటు మరో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సందడి చేశారు. కేటీఆర్-పవన్ కళ్యాణ్ కలిసి వున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.