పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న పీరియాడికల్ రొమాంటిక్ లవ్ స్టోరీ ‘రాధేశ్యామ్’.. జిల్ ఫేమ్ రాధాకృష్ణ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. అయితే జూలై 30న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు మేకర్స్ అధికారకంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రకటించిన తేదీకే రాధేశ్యామ్ విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్న దర్శక, నిర్మాతలు ఇటీవల బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ నటించిన ‘రాధే’ సినిమాని ఫాలో అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.…
కరోనా కారణంగా ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతోంది. ఎంతో మంది జీవితాలను రోడ్డున పడేసింది. లాక్ డౌన్ కారణంగా చాలా మంది ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. కాగా సినిమా సెలెబ్రిటీలు తమవంతు సాయంగా ముందుకు వస్తున్నారు. తాజాగా ప్రముఖ నటి పూజా హెగ్డే లాక్డౌన్ కారణంగా సమస్యలు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు అండగా నిలిచారు. 100 కుటుంబాలకు నెలకు సరిపడా సరుకుల్ని అందించి మంచి మనసు చాటుకున్నారు. వాటన్నింటిని తనే స్వయంగా ప్యాక్ చేశారు. ప్రస్తుతం దీనికి…
గత యేడాది ‘అల వైకుంఠపురములో’ వంటి సూపర్ డూపర్ హిట్ ను తన కిట్ లో వేసుకున్న పూజా హెగ్డే… కరోనా అనుభవాన్ని కూడా కాచి వడబోసేసింది. ఆమె నాయికగా నటిస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మూవీ విడుదలకు సిద్ధంగా ఉండగా, ‘రాధేశ్యామ్’ తుదిమెరుగులు దిద్దుకుంటోంది. అలానే ‘ఆచార్య’ మూవీ సెట్స్ పై ఉంది. ఇది కాకుండా విజయ్ తో ఓ తమిళ సినిమా, హిందీలో రెండు చిత్రాలు చేస్తోంది. అందులో ప్రధానమైంది రణవీర్ సింగ్ తో…
బుట్టబొమ్మ పూజాహెగ్డే దక్షినాదితో పాటు ఉత్తరాదిలో కూడా దూసుకెళ్తోంది. ప్రస్తుతం పూజాహెగ్డే చేతిలో భారీ ఆఫర్లే ఉన్నాయి. యంగ్ రెబల్ స్టార్ సరసన “రాధేశ్యామ్”లో నటిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు బీటౌన్ లో రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్న “సర్కస్” చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో రణవీర్ సింగ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా తన సహనటుడు రణబీర్ గురించి మాట్లాడుతూ తన శక్తిని అరువుగా తీసుకోవాలనుకుంటున్నాను అని అన్నారు పూజ. తాజాగా…
మెగాస్టార్ చిరంజీవి – దర్శకుడు కొరటాల కాంబినేషన్ లో ‘ఆచార్య’ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. కాజల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, మెగా పవర్ స్టార్ చరణ్ సరసన పూజా హెగ్డే జోడీగా నటిస్తుంది. ఈ సినిమాలో ‘సిద్ధా’ పాత్రలో చరణ్ కనిపించనున్నారు. అయితే చరణ్ నిడివి ఉంటుందనీ, జస్ట్ గెస్ట్ రోల్ అనే టాక్ వచ్చింది. అయితే తాజాగా కొరటాల మాట్లాడుతూ.. ఈ సినిమాలో చరణ్ చేస్తున్నది గెస్ట్ రోల్ కాదని, ఆయన పాత్రకు…
బుట్టబొమ్మ పూజాహెగ్డే తన అభిమాన చిత్రనిర్మాతలకు “స్వీట్” సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ బ్యూటీ తన స్వస్థలమైన మంగుళూరు నుంచి తెప్పించిన రుచికరమైన మామిడిపండ్లను చిత్ర పరిశ్రమ ప్రముఖులకు పంపుతోంది. ఇప్పటికే ఈ మామిడి పండ్లను త్రివిక్రమ్ శ్రీనివాస్, హరీష్ శంకర్, మరికొంత మంది ప్రముఖులకు పంపినట్లు తెలిసింది. తాజాగా హరీష్ శంకర్ ఈ విషయాన్నీ తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. “ఈ స్వీట్ గెస్చర్ కు ధన్యవాదాలు” అంటూ పూజాహెగ్డే…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజా చిత్రం ‘రాధేశ్యామ్’ మూవీ దాదాపు పూర్తయిపోయింది. కృష్ణంరాజుకు సంబంధించి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, కొద్దిగా ప్యాచ్ వర్క్. ఒకే ఒక్క పాట చిత్రీకరించాల్సి ఉంది. కానీ ప్రభాస్ వ్యక్తిగత సిబ్బందికి కారోనా రావడంతో పాటు పూజాహెగ్డే సైతం కొవిడ్ 19 బారిన పడింది. దాంతో అర్థాంతరంగా షూటింగ్ ను ఆపేశారు. గతంలో కొన్ని సినిమాల విషయంలో జరిగినట్టే… ఇప్పుడు కూడా ప్రభాస్, పూజా హెగ్డే మీద ఉన్న బాలెన్స్ పాటను…
అక్కినేని అఖిల్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్ బ్యానర్ మీద బన్నీవాస్, డైరెక్టర్ వాసు వర్మ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా రొమాంటిక్ కామెడీగా తెరకెక్కుతోంది. అయితే, తాజాగా ఈ సినిమాలో పూజా హెగ్డే.. తన పాత్రను వెల్లడించింది. స్టాండప్ కమెడియన్గా కనిపించనున్నట్లు పేర్కొంది. రోజుల తరబడి చేసిన సాధనను ఒక…