బుట్టబొమ్మ పూజా హెగ్డే హైదరాబాద్ ఎయిర్ పోర్టులో కనిపించినప్పుడు క్లిక్ మని అనిపించిన పిక్స్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ పొడుగు కాళ్ళ సుందరి చెన్నై వెళ్తుండగా హైదరాబాద్ విమానాశ్రయంలో కెమెరాల కంటికి చిక్కింది. తలపతి విజయ్ ‘బీస్ట్’ షూటింగ్ లో జాయిన్ అవ్వడానికి ఈ బ్యూటీ చెన్నై బయలుదేరింది. అయితే ఆ పిక్స్ లో గోధుమ రంగు మాస్క్, మ్యాచింగ్ బ్లేజర్‌తో నీలం రంగులో ఉన్న రోంపర్‌లో పూజా స్టైలిష్‌గా కనిపించింది. కాగా ‘బీస్ట్’ మూవీ షూటింగ్ ఈ రోజు (జూలై 1) చెన్నైలోని గోకులం స్టూడియోలో ప్రారంభమవుతుంది.
Read Also : యూఎస్ నుంచి తిరిగొచ్చిన ధనుష్.. నెక్స్ట్ అదే పని…!
ఈ ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్ కు నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న” బీస్ట్”లో షైన్ టామ్ చాకో, అపర్ణ దాస్, యోగి బాబు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ కు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా రెండవ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఇక సాంగ్ షూట్ కోసం ఫిల్మ్ స్టూడియోలో భారీ సెట్ ఏర్పాటు చేశారు. ఈ సాంగ్ కోసమే గతవారం పూజాహెగ్డే డాన్స్ రిహార్సల్స్ కూడా చేసింది. ఈ రెండవ షెడ్యూల్‌లో భాగంగా ఈరోజు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేయబోయే సాంగ్ ను చిత్రీకరించనున్నారు. యూరప్‌లోని జార్జియాలో మేకర్స్ మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేశారు. ఇటీవల విజయ్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రం నుంచి విడుదలైన రెండు లుక్స్ కు అద్భుతమైన స్పందన వచ్చింది.