తమిళనాడులో ఇళయదళపతి విజయ్ కి సంబంధించిన ఏదైనా సంచలనమే! ఇక ఆయన అప్ కమింగ్ మూవీ అప్ డేట్స్ అయితే ఎప్పుడూ హాట్ కేక్సే! తాజాగా విజయ్ నెక్ట్స్ మూవీ ‘బీస్ట్’ సెట్స్ మీద మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ప్రత్యక్షమయ్యాడు. ఆయన బాణీలు సమకూరుస్తున్న విజయ్, పూజా హెగ్డే స్టారర్ కి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడు. ఆ మధ్య మూవీ థీమ్ గురించి కాస్త హింట్ ఇస్తూ ఓ మాస్ వీడియో వదిలారు ఫిల్మ్ మేకర్స్. అది అప్పట్లో బాగా వైరల్ అయింది. ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంటోన్న ‘బీస్ట్’ మూవీ మరోసారి అనిరుధ్ ఫోటోల కారణంగా సొషల్ మీడియాలో చర్చగా మారింది…
నెల్సన్ దిలీప్ కుమార్ డిరెక్టోరియల్ ‘బీస్ట్’కి సినిమాటోగ్రఫర్ గా మనోజ్ పరమహంస వ్యవహరిస్తున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే సొషల్ మీడియాలో ప్రకటించటంతో పాటూ తమ సినిమా ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ అని కూడా చెప్పాడు. చూడాలి మరి, మన ‘బుట్ట బొమ్మ’ పూజా హెగ్డే కోలీవుడ్ కమ్ బ్యాక్ మూవీ ‘బీస్ట్’ ఆమెకు ఎలాంటి సక్సెస్ తెచ్చిపెడుతుందో…