ఇళయదళపతి విజయ్ 65వ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి “బీస్ట్” అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ నెల 21న విజయ్ పుట్టినరోజు సందర్భంగా “బీస్ట్” టైటిల్ ను ప్రకటిస్తూ ఫస్ట్ లుక్, సెకండ్ లుక్ లను కూడా విడుదల చేశారు. ఈ లుక్స్ కు విజయ్ అభిమానుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. యోగిబాబు, షైన్ టామ్ చాకో, విటివి గణేష్, అపర్ణ దాస్ సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సరసన పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈరోజు పూజాహెగ్డే “బీస్ట్” కోసం డ్యాన్స్ రిహార్సల్స్ చేస్తున్నాను అంటూ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఓ పిక్ ను షేర్ చేస్తూ వెల్లడించింది.
Read Also : ఉత్కంఠభరితంగా “కనబడుటలేదు” టీజర్
త్వరలోనే ఈ బుట్టబొమ్మ, విజయ్ కాంబినేషన్ లో చెన్నైలోని గోకులం స్టూడియోస్ లో సాంగ్ చిత్రీకరించనున్నారు మేకర్స్. పూజాహెగ్డేకు తమిళంలో ఇదే మొదటి చిత్రం. ప్రస్తుతం “రాధేశ్యామ్” షూటింగ్ నిమిత్తం పూజ హైదరాబాద్ లో ఉంది. ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ కు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. ఈ షెడ్యూల్ లో నాలుగు రోజుల ప్యాచ్ వర్క్, ఒక సాంగ్ షూటింగ్ జరగనుంది. పాన్ ఇండియా మూవీ “రాధేశ్యామ్” చిత్రీకరణ పూర్తి చేశాక విజయ్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది పూజ. “బీస్ట్” విషయానికొస్తే… జార్జియాలో 20 రోజుల పాటు మొదటి షెడ్యూల్ పూర్తయ్యింది. తరువాత కరోనా కారణంగా వాయిదా పడ్డ ఈ సినిమా షూటింగ్ త్వరలోనే సెకండ్ షెడ్యూల్ తో తిరిగి ప్రారంభం కానుంది.