“రాధే శ్యామ్” ఫైనల్ షెడ్యూల్ ఎప్పుడంటే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజాహెగ్డే జంటగా నటిస్తున్న పీరియాడిక్ రొమాంటిక్ ఎంటర్టైనర్ “రాధే శ్యామ్”. రాధాకృష్ణ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమా ఇంకా చిత్రీకరణ దశలో ఉంది. యూవీ క్రియేషన్స్, టి-సిరీస్, గోపికృష్ణ మూవీస్ బ్యానర్లు ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇటీవల కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తగ్గిన వెంటనే షూటింగ్ ను తిరిగి ప్రారంభించారు మేకర్స్. ప్రభాస్, పూజాహెగ్డే జూన్ లో షూటింగ్ లో పాల్గొన్నారు. దాంతో హైదరాబాద్‌లో ప్రత్యేకంగా నిర్మించిన సెట్‌లో ఈ మూవీ టాకీ భాగాన్ని పూర్తి చేశారు. తాజా సమాచారం ప్రకారం జూలై 22న హైదరాబాద్‌లోని “రాధే శ్యామ్” సెట్స్‌కు హీరోహీరోయిన్లు తిరిగి రానున్నారు.
Read Also : ఇద్దరు భామలతో “రామారావు” రొమాన్స్
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
ఆ ఫైనల్ షెడ్యూల్ లో యూనిట్ ప్రధాన నటీనటులపై పెండింగ్‌లో ఉన్న ఓ పాటను చిత్రీకరించనుంది. ఈ నెల చివరి నాటికి మొత్తం షూటింగ్ ఫార్మాలిటీలు పూర్తవుతాయి. షూటింగ్ పూర్తవ్వగానే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి కానున్నాయి. తుది షెడ్యూల్ ముగిసిన తర్వాత “రాధే శ్యామ్” నిర్మాతలు చిత్రం విడుదల తేదీని ప్రకటించాలని భావిస్తున్నారు. ఎంతోకాలం నుంచి ప్రభాస్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు షూటింగ్ పూర్తి చేసుకోనుందన్నమాట. ఇక ఈ చిత్రం పూర్తవ్వగానే ప్రభాస్ “ఆదిపురుష్”తో బిజీ కానున్నారు. పూజాహెగ్డే తమిళంలో తలపతి విజయ్ సరసన “బీస్ట్”లో నటిస్తున్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
-
Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు… సీట్లు దక్కేదెవరికి…?
-
New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
-
Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?