కొన్ని రోజుల నుంచి పాన్ ఇండియా స్టార్ యశ్ తదుపరి సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యిందంటూ వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. నర్తన్ దర్శకత్వంలో యశ్ ఓ భారీ పాన్ ఇండియా చిత్రానికి ప్లాన్ చేస్తున్నాడని, ఈ సినిమాలోనే పూజా హీరోయిన్గా చేయనుందని ప్రచారం జరిగింది. కానీ, ఈ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని తాజాగా తేలిపోయింది. యశ్ సినిమా కోసం హీరోయిన్ పాత్రకు పూజాని ఎవ్వరూ సంప్రదించలేదని సన్నిహిత వర్గాలు స్పష్టం చేశాయి.…
ఒక హీరోయిన్‌కి ఒకట్రెండు ఫ్లాపులు పడ్డాయంటే చాలు, ఆమెకు ఆఫర్లు మెల్లగా తగ్గుతూ వస్తాయి. ఆమె ఫ్లాప్ సెంటిమెంట్ ఎక్కడ తమ సినిమాలపై ప్రభావం చూపుతుందోనన్న ఉద్దేశంతో, తమ సినిమాల్లో తీసుకోవాలా? వద్దా? అని మేకర్స్ కాస్త జంకుతారు. కానీ, పూజా హెగ్డేకి మూడు ఫ్లాపులు వచ్చినా, ఆమెకు ఇంకా క్రేజీ ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. మార్కెట్లో ఆమెకున్న డిమాండ్ అలాంటిది. ఈమె కెరీర్లో సక్సెస్ శాతం ఎక్కువగా ఉండడం, ఇండస్ట్రీలో క్రేజ్ కూడా విస్తృతంగా ఉండడంతో..…
మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’లో బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ ఓ కీలక పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే! చిరంజీవితో ఉన్న సాన్నిహిత్యంతోనే అతడు తన స్టార్‌డమ్‌ని పక్కనపెట్టి, చిన్న రోల్ అయినా అది పోషించేందుకు ముందుకొచ్చాడు. ఇప్పుడు అదే సాన్నిహిత్యంతో పవన్ కళ్యాణ్ సినిమాలోనూ ఓ అతిథి పాత్రలో నటించేందుకు సల్మాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఇటీవల ఓ వెబ్సైట్ ఒక న్యూస్ రాసుకొచ్చింది. ఇదో క్రేజీ న్యూస్ కావడంతో, సోషల్ మీడియాలో వెంటనే వైరల్…
బుట్ట బొమ్మ పూజా హెగ్డే వరుస సినిమాలతో బిజీగా మారింది. ప్రస్తుతం పూజా, విజయ్ దేవరకొండ- పూరి కాంబోలో తెరకెక్కుతున్న ‘జనగణమణ’ చిత్రం షూటింగ్ లో పాల్గొంటుంది. ఇక ఈ సినిమా కాకుండా మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో నుంచి పూజా తప్పుకున్నదని వార్తలు వినిపిస్తున్నాయి . ఇప్పటివరకు ఈ వార్తలపై పూజా స్పందించకపోవడం విశేషం. ఇక తాజాగా బుట్టబొమ్మ మరో బంపర్ ఆఫర్ అందుకున్నట్లు…
బుట్టబొమ్మ పూజా హెగ్డే కు చేదు అనుభవం ఎదురైంది.. విమాన సిబ్బందిలో ఒకరు తనతో అసభ్యంగా ప్రవర్తించాడు అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది. గురువారం ముంబై నుంచి వస్తున్న ఫ్లైట్‌లో వస్తున్న ఆమెపై విపుల్ నకాషే అనే ఉద్యోగి రూడ్ గా బిహేవ్ చేయడమే కాకుండా బెదిరింపులకు పాల్పడినట్లు పూజా తెలిపింది. “ఇండిగో విమాన సిబ్బంది ఇంత అసభ్యంగా ప్రవర్తించినందుకు విచారంగా ఉంది. గురువారం ముంబై నుంచి వస్తున్న ఫ్లైట్‌లో విపుల్ నకాషే…
హ్యాట్రిక్ ఫ్లాప్స్ వచ్చినా.. పూజా హెగ్డే క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. పైగా భారీగా రెమ్యూనరేషన్‌గా పెంచేసి.. క్రేజీ ఆఫర్స్ అందుకుంటోంది. అలాంటి ఈ బ్యూటీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా నుంచి తప్పుకుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అందుకు ఎన్నో కారణాలు కూడా వినిపిస్తున్నాయి.. తాజాగా ఇప్పుడు పవన్ సినిమా వదులుకోవడానికి ఇదే అసలు కారణమని తెలుస్తోంది. మరి పూజా పవన్‌ని నిజంగానే రిజెక్ట్ చేసిందా..! ప్రస్తుతం టాలీవుడ్ స్టార్…
టాలీవుడ్లో పవన్ కళ్యాణ్, మహేశ్ బాబులకు ఎంత క్రేజ్, మార్కెట్, ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఈ హీరోలతో కలిపి పని చేసేందుకు స్టార్ డైరెక్టర్స్ నుంచి స్టార్ హీరోయిన్ల దాకా.. క్యూలో నిల్చొంటారు. అలాంటి ఆ ఇద్దరు హీరోలకు.. పూజా హెగ్డే హ్యాండ్ ఇవ్వడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అది కూడా విజయ్ దేవరకొండ కోసం ఈ అమ్మడు ఆ పని చేసింది. కొన్ని రోజుల నుంచి తానో యాక్షన్ సినిమాలో…
పాత్ బ్రేకింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ – డైనమిక్ యాక్టర్ విజయ్ దేవరకొండ ఫస్ట్ కాంబోతో తెరకెక్కిన ‘లైగర్’ మూవీ రిలీజ్ కాకుండానే వారి సెకండ్ ఫిల్మ్ ‘జేజీఎం’ (జన గణ మన) రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. శనివారం ప్రారంభమైన ఈ సినిమాలో ఫారిన్ టెక్నికల్ క్రూ కూడా వర్క్ చేస్తోంది. తొలి రోజునే హీరోయిన్ పూజా హెగ్డే సైతం షూటింగ్ లో పాల్గొంది. పూజా ఆన్ బోర్డింగ్ అంటూ చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఛార్మి, దర్శకుడు…
భారత చిత్రసీమలో ఇప్పుడున్న మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీస్‌లో పూజా హెగ్డే ఒకరు. అనతి కాలంలోనే పాన్ ఇండియా నటిగా అవతరించిన ఈమెకు.. వరుసగా క్రేజీ ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. పైగా.. ఈమె పట్టిన ప్రతీ ప్రాజెక్టూ హిట్టేనని టాక్ ఉండడంతో, ఈమెనే ప్రధానంగా తమ సినిమాల్లో తీసుకోవాలని ఫిల్మ్ మేకర్స్ ఎగబడుతున్నారు. కొందరు ఆమెను లక్కీ చార్మ్‌గా భావించి, రిపీటెడ్‌గా తమ సినిమాల్లో తీసుకుంటున్నారు కూడా! అలాంటి ఫిల్మ్ మేకర్స్‌లో హరీశ్ శంకర్ ఒకరు. పూజాతో కలిసి చేసిన…