టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస హిట్లతో దూసుకుపోతున్నారు. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరూ, సర్కారు వారి పాట.. ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకొని దుమ్ముదులుపుతున్నాడు. ఒక్క హీరోగానే కాదు.. నిర్మాతగా కూడా రాణిస్తున్నాడు మహేష్. అయితే ఇప్పటి వరకు టాలీవుడ్‌లో సత్తా చాటిన మహేష్.. రాజమౌళి సినిమాతో పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకోబోతున్నాడు. అయితే ఈ లోపు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో రాజకీయం చేయబోతున్నట్టు తెలుస్తోంది. మహేష్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో.. SSMB 28 ప్రాజెక్ట్ చేస్తున్న తెరకెక్కుతున్న తెలిసిందే. రీసెంట్‌గానే ఈ సినిమా షూటింగ్‌ను ఆగష్టు నుంచి మొదలుపెట్టి.. వచ్చే సమ్మర్ కానుకగా రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో.. మహేష్ కోసం త్రివిక్రమ్ ఓ ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్‌ను రెడీ చేసినట్టు తెలుస్తోంది.
ఈ సినిమా పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌లో.. ఇండియాలో రాజకీయం వ్యాపారంగా ఎలా మారింది అనే కాన్సెప్ట్‌తో..అదిరిపోయే యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ మూవీ కోసం మహేష్ తన రెమ్యునరేషన్ భారీగా పెంచేశాడని ప్రచారం జరుగుతోంది. దాదాపు 70 నుంచి 75 కోట్ల వరకు డిమాండ్ చేసినట్టు టాక్. మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ పై భారీ అంచనాలు ఉండడంతో.. మేకర్స్ కూడా మహేష్ డిమాండ్‌కు ఓకే చెప్పినట్లు సమాచారం. అయితే ఇందులో నిజనిజాలేంటనేది తెలియాల్సి ఉంది. ఇక పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో.. మరో హీరోయిన్‌గా యంగ్ బ్యూటీ ‘శ్రీలీల’ నటించబోతున్నట్టు వినిపిస్తోంది. హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై వస్తున్న ఈ చిత్రానికి.. థమన్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే తమన్ కొన్ని ట్యూన్స్ రెడీ చేసినట్టు టాక్. మరి నిజంగానే మహేష్ పారితోషికం పెంచేసి రాజకీయం చేయబోతున్నాడా.. అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.