Pooja Hegde: బుట్టబొమ్మ పూజా హెగ్డే ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూనే మరోపక్క వాణిజ్య ప్రకటనలలోనూ మెరుస్తూ రెండు చేతులా సంపాదిస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ పై కన్నేసిన ఈ ముద్దుగుమ్మ హృతిక్ రోషన్ తరువాత సల్మాన్ ఖాన్ సరసన కభీ ఈద్ కభీ దీవాళీ చిత్రంలో నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో వెంకటేష్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇరాక్ తాజాగా ఈ ముద్దుగుమ్మ బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో నటించే ఆఫర్ కొట్టేసింది. అయితే అది సినిమాలో కాదులే కానీ ఇలా ఒక యాడ్ లో అమితాబ్ తో అంటించి మెప్పించింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మాజా కొత్త బ్రాండ్ అంబాసిడర్ గా పూజా ఎంపికయ్యినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
మాజా యాడ్ లో ఇప్పటివరకు కత్రినా కైఫ్, కరీనా కపూర్, సమంత, రకుల్, అదితి రావు హైదరి నటించి మెప్పించారు. తాజాగా ఆ లిస్ట్ లో బుట్ట బొమ్మ కూడా చేరిపోయింది. ఇక ఈ యాడ్ లో బిగ్ బి, పూజా.. తాతా మనవరాళ్లు గా నటించడం ఆకట్టుకొంటుంది. ప్రస్తుతం ఈ యాడ్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ యాడ్ ను పూజా షేర్ చేస్తూ “తాత బట్టబయలు అయ్యారు.. ఎందుకంటే మాజాతో అందరి హృదయాలు బయటపడతాయి. అంతేకాకుండా మీ కుటుంబ చర్చ చాలా కాలం పాటు సాగుతుంది” అంటూ చెప్పుకొచ్చింది. ఇక వీడియోలో పూజా లుక్ ఆకట్టుకొంటుంది. ఈ వీడియోపై నెటిజన్స్ తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. వావ్ పూజా.. మీ తాత గారు భలే చలాకీగా మాట్లాడుతున్నారు అని కొందరు.. బిగ్ బి ని ఎట్టకేలకు తాతను చేసేశావ్ గా అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు.
Pooja Hegde Latest Instagram Post: