Off The Record: ఒకరు ఎస్ అంటే…ఇంకొకరు నో అనడం కాంగ్రెస్ డీఎన్‌ఏలో ఉన్న సహజ లక్షణం. తెలంగాణ కాంగ్రెస్‌నే తీసుకుంటే… ఒక అడుగు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కు అన్నట్టుగా ఉంటుంది వ్యవహారం. పార్టీలోకి చేరికల విషయంలో కూడా ఇదే పెద్ద సమస్యగా మారిపోతోందట. ప్రస్తుతం కొందరు నాయకుల చేరికపై పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయట. వచ్చేస్తాం… మీ పార్టీలోకి అని ఆ నాయకులు అడుగుతుంటే…. లోపల ఉన్నవారు మాత్రం పేచీల మీద పేచీలు పెట్టేస్తున్నారట. మాజీ…
పొంగులేటి వెంట తిరిగే వారందరూ ఉదయం పొంగులేటితో సాయంత్రం వేరే నాయకుడితో కలిసి తిరుగుతున్నారు. ఆ నాయకుడికి మాత్రం తెలియట్లేదు వారందరూ ఎవరుతో ఉంటున్నారొ అంటూ సంచలన వ్యాఖ్యలుచేశారు.
బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని సస్పెండ్ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఇద్దరిపై పార్టీ అధిష్ఠానం వేటు వేసింది.
నీ పప్పులు కేసీఆర్ ముందు ఉడకవని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి పై మంత్రి పువ్వాడ అజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ని గద్దె దించాలని కొంతమందిని ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తిరుగుతున్నారని ఆరోపించారు.
తనకు సెక్యూరిటీ అవసరం లేదని తను ఉగ్రవాదిని కాదు కబ్జాలు చేయలేదని మాజీ ఎం.పీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. భద్రాద్రి పినపాక నియోజకవర్గ ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గంగిరెద్దుల అడించే వారిలా సంక్రాంతి కి రాలేదని అన్నారు.
Khammam Politics: ఉమ్మడి ఖమ్మం జిల్లా టిఆర్ఎస్లో రాజకీయాలు ఎక్కువే. అక్కడ పార్టీలో నేతలు ఎక్కువే. వలస నేతలకు.. పార్టీలో ముందు నుంచి ఉంటున్న వారికి పొసగని పరిస్థితి. ఇటీవల కాలంలో ఈ పోరు రోడ్డున పడి రచ్చ రచ్చ అవుతుండటంతో.. సమస్య పరిష్కారానికి అధికారపార్టీ చర్యలు మొదలు పెట్టింది. అదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో టీఆర్ఎస్ ఒక సీటే గెలిచింది. 2018 ఎన్నికల్లోనూ అదే సీన్. ఇక్కడ కాంగ్రెస్…
ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్లోని కొందరు నేతలకు సీటు భయం పట్టుకుంది. పార్టీ ఫిరాయించేందుకు ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతున్నారు నాయకులు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిన నేతలు ప్రస్తుతం టీఆర్ఎస్లోనే ఉండిపోయారు. అలాంటి వారంతా భవిష్యత్‌పై బెంగ పెట్టుకుని పక్క పార్టీలో బిస్తర్ వేసుకుంటున్నారు. గతంలో అశ్వారావుపేట నుంచి పోటీ చేసిన ఓడిన తాటి వెంకటేశ్వరరావు టీఆర్ఎస్కు గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. ఇదే బాటలో మరికొందరు ఉన్నట్టు…