Off The Record: పొంగులేటికి రేణుకాచౌదరి అడ్డుపడుతున్నారా? ఖమ్మం కుమ్మలాట..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: ఒకరు ఎస్ అంటే…ఇంకొకరు నో అనడం కాంగ్రెస్ డీఎన్‌ఏలో ఉన్న సహజ లక్షణం. తెలంగాణ కాంగ్రెస్‌నే తీసుకుంటే… ఒక అడుగు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కు అన్నట్టుగా ఉంటుంది వ్యవహారం. పార్టీలోకి చేరికల విషయంలో కూడా ఇదే పెద్ద సమస్యగా మారిపోతోందట. ప్రస్తుతం కొందరు నాయకుల చేరికపై పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయట. వచ్చేస్తాం… మీ పార్టీలోకి అని ఆ నాయకులు అడుగుతుంటే…. లోపల ఉన్నవారు మాత్రం పేచీల మీద పేచీలు పెట్టేస్తున్నారట.
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితోపాటు… మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధమైపోయారట. పార్టీ పెద్దలతో సంప్రదింపులు కూడా ముగిశాయట. ఇద్దరిలో.. జూపల్లి చేరికకు అంతా ఓకే. తేదీ ఖరారు కావాల్సి ఉందట. ఇక మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎపిసోడ్ మాత్రం టీవీ సీరియల్‌లా సాగుతూనే ఉందట. శ్రీనివాస్ రెడ్డి పార్టీలో చేరితే ఏడు అసెంబ్లీ సీట్లు అడుగుతున్నారని, ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని గెలిపించే బాధ్యత నాదేనంటూ అధిష్టానానికి చెప్పారని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ నాయకత్వం కూడా అందుకు అంగీకరించినట్టు చెప్పుకుంటున్నారు. అంతవరకు బాగానే ఉన్నా.. అక్కడే జిల్లాకు చెందిన నేతలతో సమస్య వచ్చిందట.
Also Read
- AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
- Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
- AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
- Turkey-UN: టర్కీ బుద్ధి మారలేదు.. యూఎన్‌లో పాక్‌కు మద్దతుగా కాశ్మీర్ ప్రస్తావన
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేరికపై ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి అభ్యంతరం చెప్తున్నారు. ఆయనకు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు అప్పగించడం ఏంటన్న మౌలిక ప్రశ్న లేవనెత్తుతున్నారామె. శ్రీనివాస్ రెడ్డి చేరిక వ్యవహారాన్ని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసిసి కార్యదర్శి రోహిత్ చౌదరిలకు అప్పగించింది హైకమాండ్. అయితే..భట్టితో రేణుకా చౌదరికి ఉన్న వైరం కారణంగా శ్రీనివాస్ రెడ్డిని ఆమె వ్యతిరేకిస్తున్నారన్న చర్చ పార్టీలో జరుగుతోందట. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పొంగులేటికి టికెట్ ఇచ్చినా అభ్యంతరం లేదన్న రేణుకాచౌదరి ప్రస్తుతం అభ్యంతరం చెప్పడమేంటన్న ప్రశ్నలు వస్తున్నాయట. వచ్చే ఎన్నికల్లో ఖమ్మం నుంచి తానే పోటీ చేయాలన్న ఆలోచనలో భాగంగానే పొంగులేటిని అడ్డుకుంటున్నారా ? లేదంటే భట్టి విక్రమార్క…శ్రీనివాసరెడ్డి ఏకమైతే తనకు రాజకీయంగా ఇబ్బంది అవుతుందని భావిస్తున్నారా.. ? అన్న చర్చ జిల్లా పార్టీలో మొదలైందట. ఎవరు అడ్డుచెప్పినా..పట్టించుకోకుండా పార్టీ అధిష్టానం మాత్రం శ్రీనివాస్ రెడ్డిని తీసుకోవాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేరికపై ఢిల్లీ నాయకత్వానికి, పీసీసీకి క్లారిటీ ఉందట. ఖమ్మం జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నుంచి కూడా ఎలాంటి అభ్యంతరం లేదు. ఎటొచ్చీ…రేణుక చౌదరి నుంచి వచ్చిన అభ్యంతరాల మీదే చర్చ జరుగుతోంది. పొంగులేటి చేరిక ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌కి అదనపు బలం అవుతుందన్న అభిప్రాయం అధిష్టానానికి ఉందట. కేవలం జిల్లాలోనేగాక రాష్ట్ర వ్యాప్తంగా దీని ప్రభావం ఉంటుందని కూడా ఢిల్లీ నాయకత్వం అనుకుంటోందట. దీంతో అందర్నీ ఒప్పించి పొంగులేటిని రప్పించే బాధ్యతను రాష్ట్ర నాయకత్వం మీదే పెట్టిందట ఏఐసీసీ.
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!