Ponguleti Srinivasa Reddy: రాబోయే ఎన్నికల్లో ఏ ఒక్కరినీ అసెంబ్లీ గేటు తాకనివ్వను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponguleti Srinivasa Reddy Challenges To BRS Party: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ టికెట్ దగ్గర నుంచి తనకు అనేక అవమానాలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం మాటలు చెప్పడం వరకే ముఖ్యమంత్రి కేసీఆర్ పని అని, మాటలు చెప్తే మూడోసారి కూడా ప్రజలు ఓటు వేస్తారని సీఎం నమ్ముతున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పుడున్న వారిలో ఏ ఒక్కరిని కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వనని ఛాలెంజ్ చేశారు. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ పట్టించుకోనప్పుడు.. మీకు అండగా నేనున్నానని, అందరినీ ఆదుకున్నానని చెప్పారు. అధికార మదంతో అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులు విర్రవీగే సమయం అయిపోయిందని పేర్కొన్నారు. నాలుగు సంవత్సరాల్లో మిమ్మల్ని ఎంత హీనంగా చూశారో ఓసారి గుర్తు తెచ్చుకోవాలన్నారు. తాను మాటల మనిషిని కాదని.. అందరూ ఒకే గూటికి రావాలని తాను అందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నానని పిలుపునిచ్చారు. తాను మళ్లీ ప్రజాప్రతినిధిగా గెలిచి.. రామరాజ్యం ఇస్తానని హామీ ఇచ్చారు.
Sudan: సూడాన్ లో ఆర్మీ-పారామిలిటరీ మధ్య ఘర్షణ.. భారతీయులకు ఇంటికే పరిమితం కావాలని సూచన
Also Read
- World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
- Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
- TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
ఇదిలావుండగా.. కొన్నిరోజుల క్రితం వైఎస్ విజయమ్మను పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలవడంతో, ఆయన షర్మిల పార్టీలో చేరుతారనే ప్రచారం మొదలైంది. అయితే.. ఈ ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని ఆయన తేల్చేశారు. తాను వైఎస్ఆర్‌టీపీ పార్టీలో చేరడం లేదని, షర్మిల పార్టీలో మొహమాటానికి చేరి తన గొంతు తాను కోసుకోలేనని వ్యాఖ్యానించారు. పార్టీలో చేరడం లేదని షర్మిలకు కోపం ఉండొచ్చని.. కానీ తాను ఏ లక్ష్యంతో బీఆర్ఎస్ నుండి బయటకు వచ్చానో, ఆ లక్ష్యం ఉన్న పార్టీలో చేరుతానని తెలిపారు. దీంతో.. పొంగులేటి ఏ పార్టీలో చేరుతారు? అనే విషయం మళ్లీ మిస్టరీగా మారింది. నిజానికి.. బీఆర్ఎస్ నుంచి పొంగులేటి బయటకు వచ్చిన మొదట్లోనే ఆయన బీజేపీ పార్టీలో చేరబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది. అమిత్ షాతో భేటీ అయిన తరువాత దీనిపై అధికారిక ప్రకటన కూడా వస్తుందని వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ.. 2 నెలలు గడిచినా, ఆయన బీజేపీలో చేరికపై క్లారిటీ రాలేదు. బీజేపీ మాత్రం ఆయన్ను తమ పార్టీలో చేర్చుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.
Matrimonial fraud: మాట్రిమోని ఫ్రాడ్.. లగ్జరీ కార్లు, విల్లాలతో ఫోజులు.. మహిళలే టార్గెట్‌గా మోసం
తాజావార్తలు
-
Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
-
AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
ట్రెండింగ్
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్‌ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?