Sandra Venkata Veeraiah: పొంగులేటి వెంట తిరిగే వారందరూ ఉదయం పొంగులేటితో సాయంత్రం వేరే నాయకుడితో కలిసి తిరుగుతున్నారు. ఆ నాయకుడికి మాత్రం తెలియట్లేదు వారందరూ ఎవరుతో ఉంటున్నారొ అంటూ సంచలన వ్యాఖ్యలుచేశారు. అంతా నీవాళ్లు కాదంటూ కామెంట్ చేశారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం లో ధ్యానం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రారంభించారు. అనంతరం మాజీ ఎంపీ పొంగులేటి పై సండ్ర వెంకట వీరయ్య ఫైర్ అయ్యారు. విమర్శలే దేయంగా మీకు ఏ పనులు చేయకుండా అహంకారపూరితంగా మాట్లాడే వారికి ఓట్లు వేస్తారు మీరే తెలుసుకోవాలన్నారు. ఇలాంటి నాయకుడు ప్రజా సమయానికి అవసరమా? ప్రజల గమనించాలని అన్నారు. సాయంత్రం వేరే నాయకుడితో కలిసి తిరుగుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ నాయకుడికి మాత్రం తెలియట్లేదు ఎవరుతో ఉంటున్నారొ అంటూ సెటైర్ వేశారు. పార్టీ కోసం పని చేసే వారిని సమర్థించాలి కానీ.. వ్యక్తి ప్రయోజనం కోసం పనిచేసే వారిని సమర్థించకూడదని తెలిపారు. అలాంటి నాయకుడితో పార్టీలు నాశనం అవుతాయని విమర్శలు గుప్పించారు.
Read also: Supreme Court: అతిక్ అహ్మద్ హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం…
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధిలు పనులు చేసిన ప్రభుత్వాన్ని ఇందుకు అసెంబ్లీ గేట్లు తాకనివ్వను అని అంటున్నావ్ .. నువ్వు ప్రజలకు చేసిన మంచి పనులేంటి? ప్రజలకు చెప్పాలని ప్రశ్నించారు. ప్రజలకు అన్నీ మంచి పనులు చేసాం కాబట్టే ప్రజల విశ్వాసం పొందుతున్నాం అన్నారు. ప్రజల విశ్వాసం మాకే ఉంటుందని తెలిపారు. ఇలాంటి చౌకబారు విమర్శలు చేసే వారికి ప్రజలు నమ్మరని తెలిపారు. పొంగులేటి రాజకీయాల్లోకి రాకముందు మీ పరిస్థితి ఏంటో తెలుసని అన్నారు. ఇప్పుడు పొంగులేటి చరిత్ర ప్రజలకు తెలుసని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న నిన్ను ప్రజల గమనిస్తున్నారని అన్నారు. జిల్లాలో నీవు ఏం అభివృద్ధి చేశావు? నీకు ఎలా ఓట్లు వేస్తారు? నీకు రాజకీయ విధానం తెలియదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు జాతి పార్టీలు నీకోసం ఎదురుచూస్తున్నాయని చెప్తున్నావ్.. ఆ పార్టీలో ఉన్న నాయకులు కాదు.. నీవు వారి నాయకులవైపు చూస్తున్నావని ఎద్దేవ చేశారు. జిల్లాలో అభ్యర్థులు ప్రకటించి జాతీయ పార్టీలకు పోతాన్నా అని చెప్తున్నావ్.. అంటే ఆ పార్టీలో నీకు మద్దతు ఇస్తాయా? ఆ పార్టీ విధానాలు కూడా ప్రజల గమనిస్తున్నారని సండ్ర మండిపడ్డారు.
Health director srinivasrao: అంతా తాబీజ్ మహిమ.. అలా అనేసారేంటి..