తెలంగాణ రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జీవితం ఆధారంగా బయోపిక్ రానుంది. ‘శ్రీనన్న అందరివాడు’ పేరుతో పొంగులేటి బయోపిక్ తెరకెక్కనుంది. సినిమాలో పొంగులేటి పాత్రను సీనియర్ నటుడు సుమన్ పోషించనున్నారు. ఈ మూవీలో పొంగులేటి వ్యక్తిగత, రాజకీయ జీవితాన్ని చూపించనున్నారు. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్టర్ అండ్ నిర్మాతగా బయ్యా వెంకట నర్సింహ రాజ్ వ్యవహరిస్తున్నారు. సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. Also Read: Revanth Reddy: మా కొత్త నగరం పేరు…
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇష్టం వచ్చినట్టుగా కాంగ్రెస్ పార్టీపై మాట్లాడుతున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. ఎప్పటికో మూడున్నర సంవత్సరాల తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల గురించి కాకుండా.. త్వరలో వచ్చే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల గురించి కేటీఆర్ ఆలోచించాలని ఎద్దేవా చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికలో బచ్చా గాడిని పెట్టి గెలిపిస్తా అంటూ కేటీఆర్‌కి పొంగలేటి సవాల్ విసిరారు. మూడున్నర సంవత్సరాల తర్వాత నువ్వు ఇండియాలో ఉంటావా? లేదా ఫారిన్‌లో ఉంటావా? అంటూ విమర్శలు…
Ponguleti Srinivasa Reddy: తెలంగాణ రాష్ట్రం పునర్నిర్మాణ దిశగా నడుస్తుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో పేదల పాలన, కలల సాధనకు ప్రభుత్వం కట్టుబడిందని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. తాజాగా నిర్వహించిన సభలో ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మీ అందరి దీవెనలతో ఇందిరమ్మ రాజ్యం వచ్చింది.. రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత కష్టం వచ్చినా పేదవాడి కళలను సహకారం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్యంలో రాష్ట్ర…
తెలంగాణ మంత్రులు ఒకరిద్దరు మీడియా ముందు మాట్లాడుతున్న కొన్ని విషయాలు కాస్త రచ్చకు దారితీస్తున్నాయి. తమ శాఖలకు సంబంధం లేని విషయాల విషయాల గురించి కూడా కామెంట్స్ చేస్తుండటంతో.. మిగిలిన మంత్రులు నొచ్చుకున్నట్టు కనిపిస్తోంది. ఇదే విషయాన్ని పార్టీ నాయకత్వానికి, ఏఐసీసీ వ్యవహారాల ఇన్చార్జ్‌కు కూడా చెప్పుకున్నారట. ప్రభుత్వ పథకాలపై మంత్రుల కామెంట్స్‌తో చాలా రోజులుగా గందరగోళం పెరుగుతోంది.
కాలేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర కమిషన్ రిపోర్ట్ వచ్చాక చట్టపరమైన చర్యలు తప్పవని, ఎంత పెద్దవాళ్లు ఉన్నా వదలం అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. కాలేశ్వరం విచారణలో ఎలాంటి రాజకీయ కక్ష వేధింపులు ఉండవని స్పష్టం చేశారు. కమిషన్ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగానే.. అందులో ఎవరి పాత్ర ఉంటే వారిపైనే చర్యలు ఉంటాయన్నారు. జాతిపితగా ప్రకటించుకునే వ్యక్తి దర్యాప్తు సంస్థ ముందు విచారణకు వచ్చారని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం, ధరణి, మిషన్ భగీరథ…
జూన్2 న భూమి లేని నిరుపేద రైతులు ఎవరైతే అసైన్డ్ భూములను సేద్యం చేస్తున్నారో వారికి పట్టాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అధికారులతో జరిగిన సమావేశంలో పొంగులేటి కీలక సూచనలు చేశారు. ధరణిలో ఏర్పడ్డ ఇబ్బందులు మళ్ళీ రిపీట్ కావద్దని, ఎట్టి పరిస్థితుల్లో పొరపాట్లు జరగొద్దని తెలిపారు.
దొరకి ఏం ఆలోచన వచ్చిందో కానీ అర్ధరాత్రి వీఆర్ఏ, వీఆర్వో వ్యవస్థను తీసేశారు అని పేర్కొన్నారు. మళ్ళీ వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థను పునరుద్ధరణ చేస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు.
Ponguleti Srinivasa Reddy: నిర్మల్ జిల్లాలోని కుంటాల సభలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. భూములు ఉన్నవారికి రక్షణ కల్పించడమే భూ భారతి లక్ష్యం అన్నారు. నాలుగు పైలెట్ మండలాల్లో 13 వేల అప్లికేషన్లు వచ్చాయి.. సాధ్యమైనంత వరకు సమస్యలు అన్ని పరిష్కరిస్తాం.. ధరణి వల్ల ఇబ్బంది పడ్డారో అలాంటి సమస్య భూ భారతిలో ఉండదు.
Ponguletsi Srinivas Reddy : ఖమ్మం జిల్లా అభివృద్ధిలో తాము చేపట్టిన కార్యక్రమాల గురించి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రస్తావిస్తూ, బీజేపీ-బీఆర్ఎస్ పార్టీలపై తీవ్రమైన విమర్శలు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఒకటే. ఒకరు స్క్రిప్ట్ రాస్తే మరొకరు మాట్లాడతారు అని ఆయన ఆరోపించారు. ప్రతిపక్షం పాత్ర పోషించడంలో తప్పులేదు. కానీ విమర్శలు చేస్తే వాటికి సోయి ఉండాలి. ప్రజలు అన్నం తినలేదన్నట్టు బిల్డప్ ఇవ్వడం తప్ప మరొకటి కాదు అని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంపై…
Minister Ponguleti: భూ భారతి పోర్టల్ విస్తృత స్థాయిలో ప్రజల్లోకి వెళ్లిందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. భూ భారతికి అనూహ్య స్పందన లభిస్తుంది. నాలుగు పైలట్ మండలాల్లోని 72 రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు పూర్తి అయ్యాయి.