ఇవాళ సాయంత్రం ఖమ్మంలో జరిగే జనగర్జన సభను ఫెయిల్ చేయాలని అధికార పార్టీ తెగ ప్రయత్నాలు చేస్తోంది అని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ పాల్గొంటున్నందున సభను నిర్వహించనివ్వద్దని కుట్రలు చేస్తోందని ఆయన ఆరోపించారు. ఆర్టీసీ బస్సులు ఇవ్వకుండా అడ్డుపుల్ల వేశారు.. ప్రైవేటు బస్సులను కూడా రానివ్వకుండా అడుగడుగునా అడ్డు తగులుతున్నారు.. దీంతో ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ పార్టీ సభ విజయవంతం చేసి తీరుతామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
Read Also: Yatra 2: ఎలక్షన్స్ టార్గెట్ గా ‘యాత్ర 2’
ముఖ్యమంత్రి ఇలాంటి చౌకబారు పనులు చేయడమేమిటని పొంగులేటి ప్రశ్నించారు. జనగర్జన సభకు ప్రైవేట్ వాహనాలు, డీసీఎంలు, ఆటోలు రానివ్వడం లేదు అని ఆయన ఆరోపించారు. 15000 వాహనాలు రావడానికి సిద్ధంగా ఉన్నాయి.. ప్రభుత్వం కను సైగల్లో పని చేసే అధికారులు రోడ్లను బ్లాక్ చేసి వాహనాలను సీజ్ చేస్తున్నారు. సభకు వచ్చే వాహనాల డ్రైవర్ల నుంచి సీ బుక్ లను బలవంతంగా తీసుకుంటున్నారు అని పొంగులేటి అన్నారు. రాత్రి నుంచి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భయానక వాతావరణం సృష్టిస్తున్నారు.. ఇప్పటికే 1700 వాహనాలు సీజ్ చేశారన్నాడు.
Read Also: BEL Recruitment : భారత్ ఎలక్ట్రానిన్స్ లిమిటెడ్ లో భారీగా ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి..
సీ బుక్, ఆర్సీ బుక్ లను లాక్కొన్ని దౌర్జన్యం చేస్తున్నారు అని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అధికార మాదంతో బీఆర్ఎస్ నేతలు స్కీం లు ఇవ్వమని బెదిరింపులకు పాల్పడ్డారు. వెంసూర్ మండలం సర్పంచ్ ఆధ్వర్యంలో బెదిరింపులకు పాల్పడింది.. సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని ఆయన పేర్కొన్నారు. అధికారులు కొంతమంది పింక్ కలర్ మాత్రమే తోడుక్కొలేదు.. అధికారులు ఆత్మ పరిశీలన చేసుకోవాలి.. సాయంత్రం మీటింగ్ ఎట్టి పరిస్థితుల్లో ఫెయిల్ కాదు..
నేను భయపడడం లేదు.. నన్ను గుండెలో పెట్టుకున్న కార్యకర్తలకు, అభిమానులకు, కాంగ్రెస్ నేతలకు విజ్ఞప్తి చేస్తున్నాను.. సభను విజయవంతం చేయండి.. అవసరమైతే.. ఎంత దూరం అయిన పొండి.. కొద్ది సేపట్లో నేను కూడా రోడ్ల మీదకు వస్తాను అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
Read Also: Women Lingerie : 8నెలలుగా ఆడవాళ్ల బ్రాలు, అండర్ వేర్ల దొంగతనం.. గాయపడిన 10మంది
సత్యాగ్రహ మార్గంలో ఆందోళన చేద్దాం.. బీఆర్ఎస్ సభను తలదన్నేలా కాంగ్రెస్ సభ ఉంటుందని పొంగులేటి అన్నారు. మీ దగ్గర బైక్, ట్రాక్టర్, డీసీఎం, బస్సు, కారు.. ఏదీ లేకపోతే నడుచూకుంటు అయిన వచ్చి మన పార్టీ సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కేసీఆర్ ను ఇంటికి పంపించే ఉద్యమం ఖమ్మం గడ్డ మీద నుంచే పోరాటం చెద్దాం.. కేసీఆర్ పతనం ఈ వేదిక మీద నుంచే జరుగుతుంది.. తెలంగాణ ఉద్యమం ఖమ్మం నుంచే సాగింది..అదే విధంగా కేసీఆర్ పతనం ఇక్కడ నుంచే జరగాలని పొంగులేటి తెలిపారు.